సాధారణంగా సెలబ్రిటీలకు భారీ హంగులతో కూడిన ఇల్లు ఉంటాయని అందరికి తెలిసిందే. వారు ఇంటిని తమకు నచ్చినట్లుగా ఇంటీరియల్ డిజైన్ చేయించుకుంటారు. ఈ క్రమంలో ఎన్ని కోట్లైనా ఖర్చు చేయడానికి స్టార్ హీరోలు వెనకాడరు. ఈ నేపథ్యంలోనే ఓ స్టార్ హీరో తన ఇంటిముందు.. ఇంటి పేరును ఏకంగా వజ్రాలతో రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరోలు, హీరోయిన్ లు తమ ఇంటికి మరింత గ్రాండీయర్ లుక్ తీసుకురావడానికి ఇలాంటి కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వస్తుంటారు. అందులో భాగంగానే ఈ బడా హీరో సైతం వజ్రాలు పొదిగిన నేమ్ ప్లేట్ ను ఇంటిముందు ఏర్పాటు చేసుకున్నాడు.
గతంలో ఓ బడా హీరో.. ఇంటిముందు వజ్రాలతో నేమ్ ప్లేట్ పెట్టించాడు. కానీ సెక్యూరిటీ కారణంగా వాటిని తీయించాడు. ఇప్పుడు మళ్లీ అదే హీరో మరో సారి వజ్రాలతో నేమ్ ప్లేట్ పెట్టించాడు. ఆ బడా హీరో ఎవరో కాదు బాలీవుడ్ బాద్ షా కింగ్ షారుఖ్ ఖాన్. ముంబైలోని అత్యంత ఖరీదైన నివాసాల్లో షారుఖ్ ఖాన్ ఇల్లు కూడా ఒకటి. బాద్ షా తన ఇంటికి ‘మన్నత్’ అని పేరు పెట్టుకున్నాడు. ముంబైలో ఈ ప్లేస్ కూడా చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటిగా మారిపోయింది. దాంతో అభిమానులు షారుఖ్ ఇంటి దగ్గరికి వచ్చి ఫొటోలు దిగి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే షారుఖ్ ఖాన్ ఇల్లు మరోసారి వార్తల్లో నిలిచింది.
దానికి కారణం బాద్ షా తన ఇంటిముందు ‘మన్నత్’ ల్యాండ్స్ ఎండ్’ అక్షరాల వెనకాల ప్లేస్ లో వజ్రాలను పొదిగించాడు. దాంతో రాత్రుల్లలో లైట్ వెలుతురుకు ఈ వజ్రాలు ధగ ధగ మెరుస్తున్నాయి. ఈ అద్బుతమైన దృశ్యాన్ని చూడడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక ఈ వజ్రాలకు దాదాపు 35 నుంచి 40 లక్షల మధ్య ఖర్చు అయినట్లు సమాచారం. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ఇంటిముందు నేమ్ ప్లేట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై పలు రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాద్ షా అంటే బాద్ షానే అని కొందరు అంటుంటే.. ఎంత డబ్బు ఉంటే మాత్రం ఇలా ఖర్చు చేసుకోవాలా? చారిటీలకు ఇస్తే బాగుంటుంది కాదా? అంటూ సలహాలు ఇస్తున్నారు.
Here is that precious lovely diamond name plates at #Mannat with the new Gate.🤩
RT if you cant wait to take a selfie 🤳 soon with this new name plate on our King’s palace #Mannat #ShahRukhKhan𓀠 @iamsrk pic.twitter.com/LG60SuGjMN
— ♡♔SRKCFC♔♡™ (@SRKCHENNAIFC) November 20, 2022
Latest ⚡HQ & tagless video & pics of #Mannat’s diamond nameplate 💎 which perfectly symbolises ThePalaceOfTheLastOfTheStars🌟 & reminds us of those lyrics Dil Ka Ye Kamal Khile..Sone Ka Mahal Mile..Barasne Lage Heere Moti✨
RT if u can’t wait to click a 🤳 with it!#ShahRukhKhan pic.twitter.com/fufgJLt8qz— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) November 19, 2022