తెలుగు బుల్లితెర ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ‘ఢీ’ ముందంజలో ఉంటుంది. దాదాపు పద్నాలుగు సీజన్ల నుండి విజయవంతంగా కొనసాగుతున్న ఢీ.. మొదటి నుండి భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇన్నేళ్ళుగా ఎంతోమందిని ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ గా, డాన్సర్స్ గా తీర్చిదిద్దింది ఈ ఢీ ప్రోగ్రామ్. అలాగే ఆడియెన్స్ కూడా ముందు నుండి ఢీని ఎంతో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కాగా.. పద్నాలుగో సీజన్ రీసెంట్ గా పూర్తయినప్పటికీ, వెంటనే 15వ సీజన్ స్టార్ట్ చేశారు నిర్వాహకులు. ఈసారి ఢీ 15కి ‘ఛాంపియన్ షిప్ బ్యాటిల్’ అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక ఢీ షోలో కంటెస్టెంట్స్ పాల్గొని.. కెరీర్ లో కొరియోగ్రాఫర్స్ గా సక్సెస్ అయినవారే ఇప్పుడు ఢీలో జడ్జిలుగా కొనసాగుతున్నారు. ప్రతి బుధవారం ప్రసారమయ్యే ఢీ షోకి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రోమో రిలీజ్ చేస్తుంటారు. తాజాగా ఈ వారానికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. అయితే.. ఈ వారం శేఖర్ మాస్టర్, హీరోయిన్ శ్రద్ధాదాస్ జడ్జిలుగా కనిపించారు. ఈ నేపథ్యంలో ఢీ ప్రోగ్రాంపై సోమేశ్ టీమ్ చేసిన పర్ఫామెన్స్ చూసి ఎమోషనల్ అయిపోయాడు శేఖర్ మాస్టర్. తాము ఎక్కడికి వెళ్లినా.. ఏ స్థాయిలో ఉన్నా మాకు ఢీనే అమ్మ అని స్టేజ్ ని ముద్దాడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఢీ 15వ సీజన్ వరకు రావడంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.