బిగ్ బాస్ సీజన్ 6.. ఎట్టకేలకు ఇటీవల గ్రాండ్ ఫినాలే ముగిసేసరికి అందరూ విజేత గురించి, టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. దాదాపు 15 వారాలపాటు 21 మంది సెలబ్రిటీలతో మొదలైన బిగ్ బాస్ సీజన్ 6.. వారవారం ఆసక్తికరమైన ఎలిమెంట్స్, ఎలిమినేషన్స్ తో ఉత్కంఠగా సాగింది. చివరికి డిసెంబర్ 18న గ్రాండ్ ఫినాలేలో.. బిగ్ బాస్ 6 విన్నర్ గా సింగర్ రేవంత్.. రన్నరప్ గా శ్రీహన్.. మిగతా 3, 4, 5 స్థానాలలో కీర్తి భట్, ఆదిరెడ్డి, రోహిత్ నిలిచారు. అయితే.. షో ముగిసినప్పటి నుండి అందరూ రేవంత్ ఎంత గెలిచాడు? శ్రీహన్ మొత్తం పొందాడు? మిగతా వాళ్ళు ఎంతెంత రెమ్యూనరేషన్ అందుకున్నారు? అనే విషయాలపై ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్స్ అంతా వాళ్ళ ఫ్యామిలీని చాలా మిస్ అవుతుంటారు. మధ్యలో ఫ్యామిలీ మీటింగ్ ఏర్పాటు చేసినా.. కొన్ని కారణాల వల్ల కొందరు వాళ్ళ ఫ్యామిలీస్ ని కలవలేకపోతారు. ఈ క్రమంలో బిగ్ బాస్ విన్నర్ అయిన సింగర్ రేవంత్ కూడా తన ఫ్యామిలీని చాలా మిస్ అయ్యాడు. తన వైఫ్ ప్రెగ్నెంట్ కావడంతో హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమెను కలవలేకపోయాడు. కానీ.. ఫైనల్లీ ఇటీవల రేవంత్ వైఫ్ అన్విత.. పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే.. హౌస్ లో ఉండి.. కేవలం వీడియో కాల్స్ వరకే పరిమితమైన రేవంత్.. విన్నర్ గా ఇంటికి వెళ్ళాక.. మొదటిసారి తన కూతురుని ఎంతో ఆప్యాయంగా చేతిలోకి తీసుకున్నాడు.
రేవంత్ తన కూతురుని కలవడం కూడా సర్ప్రైజింగ్ గా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే.. మొదటిసారి కూతురిని కలవడానికి రేవంత్ కళ్ళకు గంతలు కట్టుకొని వెళ్ళాడు. పాప దగ్గరికి వెళ్ళాక గంతలు తీసి పాపను అపురూపంగా చేతిలోకి తీసుకుంటూ తండ్రిగా ఎమోషనల్ అయిపోయాడు. ప్రస్తుతం రేవంత్ తన కూతురిని మొదటిసారి గంతలు కట్టుకొని కలిసిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఇక తాను గెలిచిన బిగ్ బాస్ 6 ట్రోఫీ కూడా కూతురుకే అంకితం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రేవంత్.. తన కూతురిని తొలిసారి కలిసిన మూమెంట్ చూసి ఫ్యాన్స్ అంతా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. మరి సింగర్ రేవంత్ కూతురిని కలిసిన వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.