సాయి పల్లవి.. టాలీవుడ్ లో సెలక్టీవ్ గా కథలను ఎంచుకుంటుంది అన్న గుర్తింపు పొందింది. అదీకాక అద్భుతమైన నటన కనబరుస్తుంది అన్న బిరుదును కూడా సొంతం చేసుకున్న సాయి పల్లవి, తాజాగా ఓ డైరెక్టర్ మాయాలో పడినట్లు తెలుస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది టాలెంటెడ్ హీరోయిన్స్ ఉన్నారు. అలా నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ సాయి పల్లవి. తన అందం, అభినయంతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ ఫిదా భామ. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది సాయి పల్లవి. దాంతో అనేక వార్తలు ఫిల్మ్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొట్టాయి. అందులో ఒకటి సాయి పల్లవి సినిమాలు మానేస్తుందని, డాక్టర్ వృత్తిలో స్థిరపడుతుందని. అయితే వార్తలపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చెయ్యలేదు ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో మరో ఇంటరెస్టింగ్ న్యూస్ వినపడుతోంది.
సాయి పల్లవి.. టాలీవుడ్ లో సెలక్టీవ్ గా కథలను ఎంచుకుంటుంది అన్న మంచి గుర్తింపు ఉంది. అదీకాక అద్భుతమైన నటన కనబరుస్తుంది అన్న బిరుదును కూడా పొందింది. ఫిదా, విరాట పర్వం, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాల్లో సాయి పల్లవి నటనకు పడిపోని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే సెలక్టీవ్ గా కథలను ఎంచుకుని సినిమాలు చేసే సాయి పల్లవి.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. దాంతో త్వరలోనే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసింది. ఇక తాజాగా సాయి పల్లవి ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.
అయితే ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి ప్రధాన కారణం ఏంటంటే.. ఆ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చెయ్యబోయేది దర్శకుడు శేఖర్ కమ్ముల కావడమే. గతంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా, లవ్ స్టోరీ సినిమాల్లో సాయి పల్లవి నటన అద్భుతంగా ఉందని విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అదీకాక లేడీ క్యారెక్టర్లను కొత్తగా చూపించడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ములది ప్రత్యేక శైలి. ఆయన హీరోయిన్స్ ను చూపించే విధానం. ఆ క్యారెక్టర్లలోని మెరుపులు నచ్చే తొలి సారి వెబ్ సిరీస్ లో నటించడానికి సాయి పల్లవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కేవలం శేఖర్ కమ్ములను నమ్మే సాయి పల్లవి ఈ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఇప్పటి వరకైతే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. మరి తొలిసారి సాయి పల్లవి వెబ్ స్టోరీలో నటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.