అమెరికాలో విలాసవంతమైన ఇంటిని ఉపాసన, చరణ్ దంపతులు అద్దెకు తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజమౌళి మహేష్ సినిమా కోసం ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి అంటే సినిమా పనుల కోసం తీసుకున్నారని అనుకోవచ్చు. కానీ చరణ్, ఉపాసన దంపతులు ఇల్లు అద్దెకు తీసుకున్నారని వార్తలు రావడం వెనుక కారణం ఏంటి? ఎందుకు ఇల్లు తీసుకున్నారు?
రాజమౌళి అమెరికాలో లాస్ ఏంజిల్స్ లోని ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. మహేష్ తో చేయబోయే ప్రాజెక్ట్ కోసం ఈ ఇల్లు అద్దెకు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఉపాసన కొణిదెల కూడా అమెరికాలోని ఒక విలాసవంతమైన భవంతిని అద్దెకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం లాస్ ఏంజిల్స్ వెళ్ళింది. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. రామ్ చరణ్ తన జీవిత భాగస్వామి ఉపాసనతో అవార్డు వేడుకకు వెళ్లారు.
ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నప్పటి నుంచి చరణ్, ఉపాసన ఇద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే మొన్న 13న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకల్లో కూడా ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకలో స్పెషల్ డిజైనర్ చీరలో, అలానే స్టైలిష్ ఆభరణాలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఉపాసన. నాటు నాటు పాట ఆస్కార్ గెలిచిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇండియాకు తిరిగి వచ్చేశారు. కానీ చరణ్, ఉపాసనలు మాత్రం లాస్ ఏంజిల్స్ లోనే ఉన్నారు. ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. లాస్ ఏంజిల్స్ లో ఒక లగ్జరీ బంగ్లాను కూడా అద్దెకు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఉపాసన గర్భవతిగా ఉన్న కారణంగా కొన్ని నెలల పాటు అమెరికాలో ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. అక్కడ అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేందుకు, హెల్త్ కేర్ దృష్ట్యా బంగ్లాను అద్దెకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికా వెళ్లినప్పటి నుంచి ఇద్దరూ ఆ బంగ్లాలోనే ఉంటున్నారని.. ఇంకా కొన్ని నెలల పాటు ఆ ఇంట్లోనే ఉంటారని వార్తలు వస్తున్నాయి. వీరికి సహాయకులుగా ఇండియా నుంచి ముగ్గురు సిబ్బందిని అక్కడకు తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ ఇంట్లో చరణ్, ఉపాసన చిన్న పెట్టెలో దేవుడి ప్రతిమలకు పూజ చేస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎక్కువ రోజులు అక్కడే ఉంటారు కాబట్టి చిన్న పూజ గదిని సెటప్ చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే ఇంట్లో ఆర్ఆర్ఆర్ బృందం ఆస్కార్ వచ్చిన సందర్భంగా పార్టీ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఉపాసన అమెరికాలో విలాసవంతమైన ఇల్లు తీసుకున్నారని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.