నటసింహం నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’. బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ తో బాలయ్య అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నాడు. ఆహాలో ప్రసారం అవుతున్న ఈ టాక్ షో.. ఫస్ట్ ఎపిసోడ్ మంచు వారి ఫ్యామిలీతో మొదలైంది. అలా ప్రతి ఎపిసోడ్ లో కొత్త సెలబ్రిటీలను పిలిచి ఎంటర్టైన్ చేస్తున్నాడు బాలయ్య.
ఇప్పటికే నేచురల్ స్టార్ నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడిలతో విజయవంతంగా పూర్తి చేసాడు. ఇటీవలే అఖండ చిత్ర యునిట్ తో సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసాడు బాలయ్య. ఆ స్పెషల్ ఎపిసోడ్ తర్వాత బాలయ్యతో అన్ స్టాపబుల్ కు వచ్చేది ఎవరు అంటూ అందరిలో ఆసక్తి ఏర్పడింది. అదే టైంలో మహేష్ బాబు ప్రోమో వచ్చేసరికి అందరూ మహేష్ వస్తాడని భావించారు.
ఇప్పటికే మహేష్ బాబుతో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూట్ పూర్తయినట్లు సమాచారం. కాని ముందే ఆ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయకుండా సరైన సమయం కోసం అన్ స్టాపబుల్ టీమ్ వెయిట్ చేస్తోంది. కాబట్టి ఆ ఎపిసోడ్ ను ఈ వారం స్ట్రీమింగ్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. మరి మహేష్ కాకుండా తదుపరి ఎపిసోడ్ ఎవరితో ఉండబోతుంది? అనుకుంటున్న సమయంలో.. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి – కీరవాణి అన్ స్టాపబుల్ లో ప్రత్యక్షమైన ఫోటో రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ లో బాలయ్యతో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ముచ్చట్లు షేర్ చేసుకోబుతున్నట్లు తెలుస్తుంది.
ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న రిలీజ్ కాబోతుండటంతో.. ఆ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు జక్కన్న – కీరవాణి ఈ టాక్ షోలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం బాలయ్యతో రాజమౌళి పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య అన్ స్టాపబుల్ షోకి అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. కాబట్టి RRR చిత్రానికి ఈ షో ప్రమోషన్స్ ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు రాజమౌళి ఎపిసోడ్ ప్రోమో కోసం వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి జక్కన్నతో బాలయ్య ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో. ఈ ఎపిసోడ్ పై మీ ఎక్సపెక్టషన్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.