సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. పొలిటికల్ డ్రామాగా రూపొందించిన ఈ మూవీపై విడుదలకు ముందు ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అయితే అక్టోబర్ 1 వ తేదీన థియేటర్లలో రిపబ్లిక్ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదల చేసేందుకు మూవీ యూనిట్ లో ప్లాన్ లో ఉందట.
ఇప్పటికే ఈ దిశగా చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘రిపబ్లిక్’ మూవీని జీ 5 లో నవంబర్ 26 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి నిజంగానే ‘రిపబ్లిక్’ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల కానుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.