టాలీవుడ్ హీరోయిన్స్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని సైతం జయించిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా, హంసా నందిని వంటి హీరోయిన్లు క్యాన్సర్ తో పోరాడి గెలిచారు. మమతా మోహన్ దాస్, కల్పికా గణేష్ వంటి నటీమణులు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిన వారే. రీసెంట్ గా సమంత కూడా మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.
రష్మిక మందన్నకు డైరీ రాయడం అలవాటు. డియర్ డైరీ పేరుతో రోజూ ఏం చేసిందో అనే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం తన డే ఎలా గడిచిందో రాసుకొచ్చింది. ‘డియర్ డైరీ.. ఈరోజు చాలా ఆసక్తికరమైన రోజు. నిద్ర లేచాను. కార్డియో వర్కవుట్ చేశా. ఫుడ్ తీసుకున్నా. రేపటి షెడ్యూల్ కోసం సర్దుకున్నా. అయితే వాతావరణం, మంచు తమ రెగ్యులర్ డ్రామా చేయడం మొదలుపెట్టాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా నన్ను ప్రతీది ఆపుతుంది. ప్యాకింగ్ తర్వాత వర్కవుట్ చేశా. డిన్నర్ చేశా. డెర్మట్ (డెర్మటాలజీ) అపాయింట్మెంట్ తీసుకున్నా. ముఖ్యమైన మీటింగ్ ఉండే కానీ క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఇంటికి వచ్చేశాను. ఇప్పుడు నేను అందరికీ గుడ్ నైట్ చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ ఆల్. బాగా పడుకోండి’ అంటూ రాసుకొచ్చింది.
అంతా బాగానే ఉంది గానీ రష్మిక.. డెర్మటాలజిస్ట్ ని కలవడమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక ఎందుకు డెర్మటాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకుంది? తనేమైనా చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతుందా? అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే రష్మిక ఇన్స్టా స్టోరీస్ లో ఈ పోస్ట్ కనబడుటలేదు. తన వ్యాధి గురించి అందరికీ తెలిసిపోతుందేమో అన్న భయంతో రష్మిక పోస్ట్ తొలగించి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రష్మికకు నిజంగానే స్కిన్ సమస్యలు ఉన్నాయా? లేక వేరే ఎవరి కోసమైనా అపాయింట్మెంట్ తీసుకుందా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.