టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు యూత్ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన ‘పుష్ప’తో పాన్ ఇండియా ఇమేజ్‌ను ఆమె సొంతం చేసుకుంది. అనంతరం బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన ఆమె.. ‘గుడ్ బై’ చిత్రంతో ఉత్తరాదిన ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ మూవీ ఫలితం ఆమెకు నిరాశనే మిగిలిచ్చింది. దీంతో ‘మిషన్ మజ్ను’ పైనే రష్మిక గంపెడాశలు పెట్టుకుంది. ‘మిషన్ మజ్ను’ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన రష్మిక.. కొంతకాలంగా సోషల్ మీడియాలో తాను ఎదుర్కొంటున్న ట్రోల్స్‌పై స్పందించింది.
జీవితంలో తాను చేసే ప్రతి పని మీదా ట్రోల్స్ వస్తున్నాయన్న రష్మిక.. తన తప్పేంటో సరిగ్గా చెబితే వినడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. అర్థమయ్యేలా కమ్యూనికేట్ చేస్తే బాగుంటుందని.. కానీ దుర్భాషలాడితే మాత్రం అది మానసికంగా ప్రభావితం చేస్తుందని పేర్కొంది. నేషనల్ క్రష్‌గా ప్రేక్షకుల్లో సంపాదించుకున్న క్రేజ్, పాపులారిటీని ఎప్పుడైనా వదులుకోవాలని అనిపించిందా? అనే ప్రశ్నకు ‘కొన్నిసార్లు’ అనిపించిందని బదులిచ్చింది. ‘ఎందుకంటే జనాలకు నా బాడీతో కూడా సమస్యలు ఉన్నాయి. నేను ఎక్కువ వర్కవుట్ చేస్తే మగాడిలా కనిపిస్తున్నానంటారు. కాస్త బరువెక్కితే చాలా లావుగా ఉన్నానంటారు. ఎక్కువగా మాట్లాడితే భయపడుతోందని, అస్సలు మాట్లాడకపోతే ‘యాటిట్యూడ్’ అని పేర్లు పెడతారు. నేను శ్వాస తీసుకున్నా, తీసుకోకపోయినా వారికి సమస్యే అంటే నేనేం చేయాలి. ఈ రంగంలో ఉండాలా? వదిలేసి వెళ్లిపోవాలా’ అని రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.
ట్రోల్స్ చేసేవాళ్లు తనలో ఎలాంటి మార్పును కోరుకుంటున్నారో స్పష్టంగా చెబితే వింటానని రష్మిక తెలిపారు. కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోతే తానేం చేయాలని క్వశ్చన్ చేసింది. ఏదైనా సమస్య ఉంటే చెప్పాలి గానీ వల్గర్ వర్డ్స్ ఉపయోగిస్తూ దుర్భాషలాడొద్దని రష్మిక చెప్పుకొచ్చింది. కొందరు తనపై చేసే కామెంట్లలో వాడే కొన్ని పదాలు మానసికంగా చాలా ప్రభావితం చేస్తాయని రష్మిక పేర్కొంది. ఇకపోతే, ఇళయదళపతి విజయ్ సరసన నటించిన ‘వారసుడు’తో సంక్రాంతికి హిట్ అందుకున్న రష్మిక.. ప్రస్తుతం ‘పుష్ప 2’లో నటిస్తోంది. ఈ మూవీ వైజాగ్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందులో సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. మరి, సోషల్ మీడియాలో నటులపై వచ్చే ట్రోల్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.