హీరోయిన్ రష్మిక ఈ మధ్య చాలా బిజీ అయిపోయింది. ఎక్కడ చూసినా సరే ఆమెనే కనిపిస్తోంది. అటు సినిమాలు, ఇటు వివాదాలతో సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. కన్నడ భామ రష్మిక.. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ వరస సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన ‘మిషన్ మజ్ను’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ సెటిలైపోయిందుకు అనుకుంటా.. ఫుల్ ప్లానింగ్ తో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘కిరిక్ పార్టీ’ సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఛలో’ మూవీతో హిట్ కొట్టి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత యువహీరోలతో నటించి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ తో స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక.. ‘పుష్ప’తో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకుంది. ఇదే టైంలో హిందీలోనూ అమితాబ్ తో ‘గుడ్ బై’ అనే మూవీ చేసింది.
గతేడాది రిలీజైన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో రష్మిక చేసిన మరో హిందీ మూవీ ‘మిషన్ మజ్ను’ విడుదల కానుంది. జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో మోడ్రన్ డ్రస్ లో కనిపించిన రష్మిక.. జీన్స్ టాప్ లో కనిపించి నెటిజన్స్.. తమని తాము మైమరిచిపోయేలా చేసింది. ప్రస్తుతం ఇవే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు ఫ్యాన్స్ అయితే ‘రష్మిక ఏంటి ఇంత హాట్ గా తయారవుతోంది’ అని కామెంట్స్ పెడుతున్నారు.