సినీ పరిశ్రమలో.. హీరోయిన్ల మధ్య స్నేహం అనేది చాలా రేర్‌గా కనిపిస్తుంది. హీరోలైనా సరే.. ఒకరి ఆడియో ఫంక్షన్‌కు మరొకరు అటెండ్ అవుతారేమో కానీ.. హీరోయిన్‌ల విషయంలో మాత్రం ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. హీరోయిన్లు కనీసం ఒకరినొకరు ప్రశంసించుకోవడం కూడా చాలా అరుదు. ఏదో పుట్టిన రోజు, పెళ్లి, ఇతర సందర్భాల వేళ.. సోషల్ మీడియాలో విషేస్ చెప్పడం మాత్రం చూస్తుంటాం. అంతేతప్ప.. ఒక హీరోయిన్‌ను ఉద్దేశించి.. మరో హీరోయిన్.. తను నాకు స్ఫూర్తి.. ఎంతో నేర్చుకున్నాను అని చెప్పడం చాలా అంటే చాలా అరుదు. అలా చెప్పాలంటే సదరు హీరోయిన్‌కు ఎంతో మంచి మనసు ఉండాలి. అయితే ఈ లక్షణాలు రష్మిక మందన్నాలో ఉన్నాయి. తాజాగా సమంత గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయిన రష్మిక.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
నేషనల్ క్రష్ రష్మిక నటించిన ‘వారీసు’ మూవీ తెలుగులో ‘వారసుడు’ పేరుతో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రష్మిక వరుస ప్రమోషన్స్, ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. సమంత ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. సమంత తనకు స్ఫూర్తి అని.. తనకు అమ్మలా మారి.. కాపాడుకోవాలని ఉంది అంటూ.. రష్మిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
రష్మిక, సమంత ఇద్దరు కలిసి పుష్ప సినిమాలో నటించారు. దానికంటే ముందు నుంచే వీరి మధ్య స్నేహం ఉంది. కాగా సమంత ఇటీవల తాను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు.. ఆమెతో కలిసి నటించిన చాలా మందికి తెలియదు. సామ్ ప్రకటించాకే.. వారందరికి దీని గురించి తెలిసిందే. రష్మికకు కూడా సమంత అనారోగ్యం గురించి ఈ మధ్యకాలంలోనే తెలిసిందట. ఈ నేపథ్యంలో.. రష్మిక తాజా ఇంటర్వ్యూలో.. సమంత గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ కామెంట్లు చేసింది.
‘‘సమంత మయోసైటిస్ బారినపడినట్లు తను ప్రకటించే వరకూ నాకు కూడా తెలియదు. షూటింగ్ సమయంలో కలిసినప్పుడు.. మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కానీ తను ఎప్పుడూ తన అనారోగ్యం విషయం గురించి ఒక్కసారి కూడా నాతో చెప్పలేదు. సమంత చాలా అందమైన, దయగల మహిళ. ఒక అమ్మలా తనని కాపాడుకోవాలని.. రక్షించుకోవాలని అనుకుంటున్నా. జీవితంలో తను ఎన్నో సవాళ్లను దాటుకుని.. నిలబడింది అందుకే సమంత అంటే అందరిలా నాకు కూడా స్ఫూర్తి. నేను ఎంతగానో ఇష్టపడే సామ్‌కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అన్నది రష్మిక. ఈ క్రమంలో రష్మికపై నెటిజనులు.. ప్రశంసలు కురిపిస్తున్నారు.