రష్మీ గౌతమ్.. బుల్లితెర మీద యాంకర్‌గా రాణించడమే కాక.. సినిమాల్లో కూడా నటిస్తూ.. కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ‘ఎక్స్ట్రా జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి టీవీ షోలకు యాంకరింగ్ చేస్తున్నారు. మరోవైపు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. గత ఏడాది రష్మీ హీరోయిన్‌గా నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా విడుదలై.. మంచి విజయం సాధించింది. ఇక ప్రస్తుతం రష్మీ.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రష్మీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
యాంకర్ రష్మీ గౌతమ్.. ఇంట్లో కీలకమైన వ్యక్తి ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది రష్మీ. తన గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా శుక్రవారం తుది శ్వాస విడిచారని తెలిపింది. బరువెక్కిన గుండెతో కుటుంబం అంతా ఆమెకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికామని రష్మీ తన పోస్ట్‌లో పేర్కొన్నంది. ‘‘ప్రమీలా మిశ్రా ఎంతో స్ట్రాంగ్ వుమన్. మాపై ఆమె ప్రభావం ఎంతో ఉంది. ఆమె దూరమైనా.. ఆమె జ్ఞాపకాలు ఎల్లప్పుడు మాతో ఉంటాయి. ఓం శాంతి’’ అంటూ పోస్ట్ చేసుకొచ్చింది రష్మీ. ఈ విషయం తెలిసిన అభిమానులు.. బీ స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.