స్టార్ హీరోల పుట్టిన రోజు వస్తుందంటే చాలు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు ఖచ్చితంగా తమ హీరో కొత్త సినిమాకి సంబంధించి.. ఏదైనా చిన్న అప్డేట్ అయినా అనౌన్స్ చేస్తారని అభిమానులకి చిన్న ఆశ. తాజాగా అలాంటి ఒక అప్డేట్ ఇప్పుడు ఒక టాప్ హీరో సినిమా విషయంలో అనౌన్స్ చేయడానికి సిద్ధమైపోయారు మూవీ మేకర్స్. మార్చ్ 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు..
స్టార్ హీరోల పుట్టిన రోజు వస్తుందంటే చాలు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు ఖచ్చితంగా తమ హీరో కొత్త సినిమాకి సంబంధించి.. ఏదైనా చిన్న అప్డేట్ అయినా అనౌన్స్ చేస్తారని అభిమానులకి చిన్న ఆశ. ఈ విషయంలో ఫ్యాన్స్ ని నిరాశపర్చకుండా.. వారి పుట్టిన రోజు ఏదో ఒక అప్డేట్ ఫ్యాన్స్ కి అందించే ప్రయత్నం చేస్తారు స్టార్ హీరోస్. తాజాగా అలాంటి ఒక అప్డేట్ ఇప్పుడు ఒక టాప్ హీరో సినిమా విషయంలో అనౌన్స్ చేయడానికి సిద్ధమైపోయారు మూవీ మేకర్స్. మార్చ్ 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కి మెగా పవర్ స్టార్ కొత్త సినిమాకి సంబంధించిన టైటిల్ రివీల్ చేయాలనుకుంటున్నారు.
రామ్ చరణ్ ఈ మధ్య ఏదొక విషయంతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ మెగా తనయుడి జోరు ఇప్పుడు మాములుగా లేదు. ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గానే కాదు ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. పాన్ ఇండియా మూవీగా రిలీజైన ట్రిపుల్ ఆర్ ని ఆస్కార్ బరిలో నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా విజయంతో రామ్ చరణ్ పై తదుపరి సినిమాల బాధ్యత మరింత పెరిగిందని చెప్పాలి. దీంతో ప్రస్తుతం తాను చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో సౌత్ ఇండియా అగ్ర దర్శకుల్లో ఒకరైన శంకర్ తో ఆర్సీ 15 చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడో వెళ్లినా.. ఎలాంటి చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీనితో అభిమానులు ఈ విషయంలో బాగా నిరాశకు లోనయ్యారని తెలుస్తుంది. కానీ.. ఇప్పుడు ఫ్యాన్స్ ని ఖుషీ చేయడానికి రామ్ చరణ్ పుట్టిన రోజున ఆర్సీ15 సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్ చేయబోతున్నారని టాక్.
ఇప్పటివరకు తెలుగు హీరోలతో పని చేయని డైరెక్టర్ శంకర్ ఇప్పుడు తొలిసారి రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే.. ఇప్పుడు రివీల్ చేయబోయే సినిమా టైటిల్ గురించి ఇటు ఫ్యాన్స్ లో, అటు ఇండస్ట్రీ లో బాగా క్యూరియాసిటీ ఏర్పడింది. ఇప్పటివరకు శంకర్ సినిమాల టైటిల్స్.. భాషను బట్టి మారుతూ వచ్చాయి. ఉదాహరణకు ‘తెలుగులో రోబో.. తమిళంలో ఏంథిరన్’.. ‘ఆనియన్ – అపరిచితుడు’గా రిలీజ్ అయ్యాయి. మరి ఈసారి ఆర్సి15 విషయంలో కూడా శంకర్ మరోసారి తన టైటిల్ సెంటిమెంటునే కొనసాగిస్తాడా? లేకపోతే ఈసారి అన్ని భాషలకు కలిపి ఒకే టైటిల్ పెడతాడా? చూడాలి. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి స్వరాలూ సమకూరుస్తున్నాడు. మరి శంకర్-చరణ్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలుపండి.
#RC15 pic.twitter.com/erFrp6Te5j
— Aakashavaani (@TheAakashavaani) March 3, 2023