అనారోగ్యంతో బాధపడే ఫ్యాన్స్ చివరి కోరికలను తీర్చడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. కొంతమంది హీరోలు మాత్రం వీలు కల్పించుకొని ఫ్యాన్స్ దగ్గరికి వెళ్లి.. వారి లాస్ట్ విష్ నిజం చేస్తుంటారు.
సెలబ్రిటీలు అనారోగ్యంతో బాధపడే ఫ్యాన్స్ చివరి కోరికలను తీర్చడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. కొంతమంది నేరుగా కలవలేకపోయినా .. వీడియో కాల్స్ లో అయినా కనిపించి మాట్లాడుతుంటారు. పిల్లలైతే ఏది వీలుకాని పరిస్థితులలో గిఫ్టులను పంపి సంతోషపరిచేందుకు ట్రై చేస్తుంటారు. కానీ.. కొంతమంది హీరోలు మాత్రం వీలు కల్పించుకొని ఫ్యాన్స్ దగ్గరికి వెళ్లి.. వారి లాస్ట్ విష్ నిజం చేస్తుంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ వీరాభిమానిని హాస్పిటల్ కి వెళ్లి కలిశాడు. తన బుల్లి ఫ్యాన్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడని తెలిసి.. స్వయంగా వెళ్లి ఆ బుడ్డోడిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ ఆ ఫ్యాన్ ని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. మణికౌశల్ అనే పిల్లాడు క్యాన్సర్ తో హాస్పిటల్ లో బెడ్ పై పోరాడుతున్నాడు. ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ వారు ఈ విషయాన్ని రామ్ చరణ్ కి చేరవేయగా.. వెంటనే తన అభిమానిని కలిసి.. తన కళ్ళలో ఆనందం చూడాలని వచ్చాడట మెగాహీరో. అలా బుడ్డోడి కోరికను నెరవేర్చి.. అతనితో చాలా టైమ్ స్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. సరదాగా ఆ మణికౌశల్ తో ముచ్చటించి.. గిఫ్టులు కూడా ఇచ్చాడట చరణ్. దీంతో అభిమాన హీరోని చూసేసరికి ఆ పిల్లాడు ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. ప్రెజెంట్ మణికౌశల్ ని రామ్ చరణ్ కలిసిన పిక్ చూసి.. నెటిజన్స్, మెగాఫ్యాన్స్ అంతా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈరోజు హైదరాబాద్ లోని చార్మినార్ ఏరియాలో జరిగిన శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు చరణ్. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో.. రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. కానీ.. ఈ సినిమాకి మొదటి నుండి లీక్స్ బెడద తప్పలేదు. ఈరోజు జరిగిన హైదరాబాద్ షెడ్యూల్ నుండి కూడా ఓ పొలిటికల్ పార్టీ సీన్ సంబంధించి పిక్స్ లీక్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న సినిమా ఇది. పైగా దర్శకుడు శంకర్ కాబట్టి.. అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఈ విషయం పక్కనపెడితే.. రామ్ చరణ్ తన అభిమానిని కలిసి విష్ చేసిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Through #MakeaWishFoundation our #ManOfMasses Mega Power Star @AlwaysRamCharan garu met a 9yr old kid ailing from cancer. The kid’s wish of meeting his favourite star was fulfilled with the actor spending quality time with him. #ManOfMassesRamCharan #Ramcharan pic.twitter.com/vAPMAl9VdV
— SivaCherry (@sivacherry9) February 9, 2023