Ram Charan: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న దేశ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజే వంద కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు దాదాపు 1200 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఓటీటీ ప్లాట్ ఫాంలపై కూడా ఆర్‌ఆర్‌ఆర్ తన సత్తా చాటింది. ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ లెవెల్‌కు తీసుకుపోయింది. హాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు. ఆస్కార్‌లోనూ ఈ సినిమా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది.
ఇక, ఆర్‌ఆర్‌ఆర్ సినిమా జపాన్‌లో విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 21న జపాన్ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ కోసం జపాన్‌కు వెళ్లింది. రాజమౌళి.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ దంపతులు జపాన్ వెళ్లారు. అక్కడ ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల జపాన్ ప్రమోషన్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్, ఉపాసన జపాన్ ఫ్యాన్స్‌తో కలిసి డిన్నర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మంగళవారం రాత్రి రామ్ చరణ్, ఉపాసన జపాన్‌లోని ఓ హోటల్‌లో డిన్నర్ చేశారు. రామ్ చరణ్‌ను గుర్తించిన ఫ్యాన్స్ ఆయనతో ఫొటో దిగారు. ఆ ఫొటోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీగా పెట్టుకున్నారు. దాన్ని స్క్రీన్ షాట్లు తీసి మరీ మెగా అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇక, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఓలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియా శరణ్, సముద్ర ఖని తదితరులు ముఖ్య పాత్రలను షోషించారు.