సాధారణంగా ఖాళీ సమయంలో ఎవరైనా నచ్చిన పనులు చేసేందుకు ఇష్టపడతారు.. నచ్చిన ప్రదేశాలకు వెళ్తుంటారు. సినీతారలైతే ఫారెన్ టూర్ అంటూ విదేశాలకు వెళ్లిపోతుంటారు. మరికొందరు లోకల్ లోనే టైమ్ పాస్ చేస్తుంటారు. అయితే.. సినీతారలు ఇష్టపడేవాటిలో.. ఫారెన్ టూర్స్ తో పాటు స్పోర్ట్స్, రేసింగ్ గేమ్స్ కూడా లిస్టులో ఉంటాయి. ఇక సమయం దొరికితే లేదా దగ్గరలో ఎక్కడైనా కార్ రేసింగ్ జరుగుతుందని తెలిస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేందుకు వెళ్లిపోతారు. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన.. హీరో అక్కినేని నాగచైతన్య హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలను చూసేందుకు హాజరయ్యారు.
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ సమీపంలో ఇండియన్ రేసింగ్ లీగ్ విజయవంతంగా ముగిసింది. శనివారం ప్రాక్టీస్ సెషన్స్ అనంతరం.. ఆదివారం మెయిన్ రేసులు జరిగాయి. ఈ పోటీలలో ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలకు చెందిన టీమ్స్ పోటీలో పాల్గొన్నాయి. అయితే.. ఓవరాల్ ఛాంపియన్ షిప్ లో కేరళకు చెందిన కొచ్చి టీమ్ విజేతగా నిలిచింది. టైటిల్ విజేతగా నిలిచిన కొచ్చి టీమ్ కి 417.5 పాయింట్స్ రాగా.. 385 పాయింట్స్ తో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ రెండో స్థానం కైవసం చేసుకుంది. కాగా.. చివరి ఫీచర్ రేసులో మాత్రం చెన్నై టీమ్ గెలిచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ రేసింగ్ లీగ్ పోటీలలో రామ్ చరణ్ దంపతులు, నాగచైతన్య సందడి చేశారు.
రామ్ చరణ్ సతీసమేతంగా హాజరై పోటీలను ఎంజాయ్ చేశాక.. రేసింగ్ కార్స్ పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. “హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరగడం ఆనందంగా ఉంది. కొచ్చి లీడింగ్ లో ఉందని తెలిసింది.. కానీ, నా ఫేవరేట్ టీమ్ మాత్రం హైదరాబాదే.” అని చెప్పాడు. అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ.. కాలేజ్ రోజుల్లో ఈ స్ట్రీట్స్ లో కార్ లో తిరుగేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడే స్ట్రీట్ రేసింగ్ జరుగుతుండటం అద్భుతంగా ఉందని తెలిపాడు. ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన, నాగచైతన్యలు రేసింగ్ లో సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. మరి ఈ ఇండియన్ రేసింగ్ లీగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.