తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు రాధిక. ప్రముఖ తమిల నటుడు ఎం.ఆర్.రాధా కూతురు రాధిక. చిలిపి వయసు చిత్రంతో రాధికకు మంచి పేరు రావడంతో వరుస చిత్రాల్లో ఆఫర్ వచ్చింది. తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది రాధిక. అప్పట్లో రాధిక, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. నటిగానే కాకుండా దర్శక, నిర్మాతగా కూడా రాధిక సత్తా చాటింది. ఇప్పటికీ ఆమె వెండితెర, బుల్లితెరపై నటిస్తూనే ఉన్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ హూస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో లో రాధిక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె తన జీవితంలో జరిగిన కీలక సంఘటనల గురించి గుర్తు చేసుకున్నారు.
బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 లో నల్లారి కిరణ్ కుమార్, సురేష్ రెడ్డి లు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. వారితో పాటు ప్రముఖ నటి రాధిక కూడా ఈ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధిక గురించి బాలకృష్ణ ఓ సంఘటన గుర్తు చేశారు. ఆమెకు సినిమా పట్ల ఎంత డెడికేషన్ అంటే.. పాప పుట్టి రెండు నెలలే అవుతున్నా.. రాధిక షూటింగ్ కి వెళ్లిపోయారని గుర్తు చేశారు. నేను చెన్నైలో ఉన్నపుడు నాకు గురించి ఎక్కువగా పట్టించుకున్న వారిలో రాధిక ఒకరు అన్నారు. నా గురించి ఎవరైనా కామెంట్స్ చేసినా.. నా జోలికి ఎవరొచ్చినా వారికి లెఫ్ట్ రైట్ ఇచ్చేది. రాధికా అంటే ఫైర్ అని చెప్పుకొచ్చారు. వెంటనే రాధిక మరి నువ్వు నాకు ఎంతో ప్రత్యేకం అన్నారు.
ఈ సందర్బంగా రాధిక మాట్లాడుతూ.. సాధారణంగా హీరోయిన్స్ తమ గ్లామర్ కాపాడుకోవడానికి రక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. పెళ్లి చేసుకుంటే.. తల్లి అయితే తమ శరీరాకృతిలో మార్పులు వస్తాయని చాలా మంది భావిస్తుంటారు. ఇండస్ట్రీలో కొందమంది కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నపుడు పెళ్లి చేసుకోకూడదు.. పిల్లలను కనకూడదు అంటూ సలహాలు.. సూచనలు ఇస్తుంటారు. కానీ అవన్నీ ఒట్టి ట్రాష్.. నాకు పెళ్లై పాప పుట్టిన తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగాను.. మంచి ఆఫర్లు వచ్చాయని అన్నారు.
నాకు పాప పుట్టిన రెండు నెలలకు నా గురువు భారతీరాజా ఓ మంచి స్టోరీ ఉంది.. నువ్వే హీరోయిన్ గా నటించాలని పట్టుబట్టాడు. అప్పటికే నాకు పాపు పుట్టి రెండు నెలలు మాత్రమే అవుతుంది.. కానీ ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం షూటింగ్ లో పాల్గొని చిత్రాన్ని పూర్తి చేశాం. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో నాకు వరుస ఆఫర్లు రావడం.. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే నా పాప పుట్టిన తర్వాతనే నా తలరాత మారిందని చెప్పొచ్చు అన్నారు.