Project K: బాహుబలితో దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ అందుకున్న డార్లింగ్ ప్రభాస్.. అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలు చేసిన ప్రభాస్.. ఇప్పుడు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీస్ చేస్తున్న చేస్తున్నాడు. పాన్ ఇండియా హీరోగా ఉన్న ప్రభాస్ క్రేజ్.. ఈ సినిమాలతో మరింత నెక్స్ట్ లెవల్ కి వెళ్లనుంది. ఈ క్రమంలో ఆదిపురుష్, సలార్ సినిమాలు వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి.
సలార్ షూటింగ్ దశలో ఉండగా, ఆదిపురుష్ షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. వీటితో పాటు యూన్గ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ మూవీని సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ కాగా, అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ప్రాజెక్ట్ కే మూవీకి సంబంధించి సాలిడ్ అప్ డేట్ అందించారు నిర్మాత అశ్వినీదత్.
ఆయన మాట్లాడుతూ.. ‘ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే మూవీ చూశాక అందరూ ఆశ్చర్యపోతారు. సినిమా అమేజింగ్ గా వస్తుంది. మేం చైనా, అమెరికా లాంటి ఇంటర్నేషనల్ మార్కెట్లను టార్గెట్ చేసుకొని రాబోతున్నాం. ప్రాజెక్ట్ కే మూవీ అవెంజర్స్ లాంటి సినిమా. వీటన్నికంటే ప్రభాస్ టెర్రిఫిక్ గా కనిపించబోతున్నాడు. 2023 జనవరి వరకు షూటింగ్ పూర్తిచేసి, 2023లోనే అక్టోబర్ 18న సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం’ అని తెలిపారు. ప్రస్తుతం అశ్వినీదత్ గారి మాటలు ప్రాజెక్ట్ కే పై అంచనాలు పెంచుతున్నాయి.
ఇదిలా ఉండగా.. డార్లింగ్ ప్రభాస్ మార్కెట్ స్థాయి ఇప్పుడెలా ఉందో విదితమే. సాహో, రాధేశ్యామ్ సినిమాలు నిరాశపరిచినా ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై భారీ అంచనాలతో, ఎంతో నమ్మకంగా ఉన్నారు ప్రేక్షకులు, ఫ్యాన్స్. అయితే.. ప్రభాస్ కి సంబంధించి ఏ కొత్త విషయం తెలిసినా ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. అటువంటిది అప్ డేట్స్ లేని ఈ టైమ్ లో ప్రాజెక్ట్ కే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం విశేషం. మరి ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#ProjectK will be a “#Avengers” style film that will amaze everyone. We are planning to release the film on October 2023 or January 2024 targeting China, America, and other international markets on the widest scale possible.
Producer #AshwiniDutt
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) July 28, 2022