టాలీవుడ్‌కు చాలా మంది హీరోయిన్లు పరిచయమ్యారు. అయితే వీరిలో చాలా మంది తక్కువ సినిమాలు చేస్తూ.. మంచి ప్రశంసలు అందుకున్నవారున్నారు. అందులోనూ ప్రముఖ దర్శకులు బాపు, రమణలతో పాటు కె. విశ్వనాథ్ హీరోయిన్లకు క్రేజీ విపరీతంగా ఉండేది. వారితో ఒక్క సినిమా చేసిన చాలు స్టార్ డమ్ ఖాయం. ఆ జాబితా కిందకు వస్తారు నటి ప్రియా రామన్.
టాలీవుడ్‌కు చాలా మంది హీరోయిన్లు పరిచయమ్యారు. అయితే వీరిలో చాలా మంది తక్కువ సినిమాలు చేస్తూ.. మంచి ప్రశంసలు అందుకున్నవారున్నారు. అందులోనూ ప్రముఖ దర్శకులు బాపు, రమణలతో పాటు కె. విశ్వనాథ్ హీరోయిన్లకు క్రేజీ విపరీతంగా ఉండేది. వారితో ఒక్క సినిమా చేసిన చాలు స్టార్ డమ్ ఖాయం. ఆ జాబితా కిందకు వస్తారు నటి ప్రియా రామన్. ప్రియా రామన్ అంటే చాలా మందికి తెలియక పోయి ఉండొచ్చు కానీ విశ్వనాథ్ దర్శకత్వం వహించి, నటించిన శుభ సంకల్పం సినిమాలో నటించింది ఆమె. అందులో విశ్వనాథ్ కుమార్తె పాత్రలో కనిపించి.. మన అమ్మాయే అనిపించేలా కట్టుబొట్టుతో ఆకట్టుకుంది ఈ చిన్నది.
1993లో రజనీకాంత్ నిర్మాతగా తెరకెక్కించిన సినిమా వల్లి (తెలుగులో విజయ పేరుతో డబ్బింగ్ చేశారు)తో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ప్రియా రామన్. ఆ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. దీంతో ఆమెకు తమిళ, మలయాళ పరిశ్రమలో వరుసగా ఆఫర్లు వచ్చాయి. అర్జున్ హీరోగా నటించిన మనవూరి మారాజు చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తెలుగులో దేశ ద్రోహులు, శుభ సంకల్పం, దొర బాబు, శ్రీవారి ప్రియురాలు, బాలకృష్ణ శ్రీ కృష్ణ విజయంలో నటించింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో కనిపించింది. నేశం పుడుచు అనే సినిమా షూటింగ్ సమయంలో తమిళనటుడు రంజిత్‌ని (స్నేహం కోసం సినిమాలో నటించారు) ప్రేమించారు. అనంతరం 1999లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు.
వీరికి ఇద్దరు పిల్లలు. అయితే సినిమా పరిశ్రమలో పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకోవడం పరిపాటే. కానీ ఆమె వ్యక్తిగత జీవితం చాలా భిన్నం. 2014లో కొన్ని గొడవల కారణంగా వీరిద్దరూ విడిపోగా.. విడాకులు కూడా తీసుకున్నారు. రంజిత్ రాగసుధ అనే నటిని రెండో వివాహం చేసుకున్నారు. తర్వాత విడిపోయారు. అయితే 2018లో తిరిగి రంజిత్‌ని ప్రియా రామన్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సీరియల్స్‌లో నటించింది. తర్వాత ప్రొడ్యూసర్‌గా కూడా మారారు. అలాగే స్పెషల్ షో గెస్టుగా వస్తుంటారు. అయితే తెలుగులో ఆమె చాలా రోజుల తర్వాత 2019లో హను రాఘపూడి సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చారు. అదే శర్వానంద్.. పడిపడి లేచే మనస్సు సినిమాలో అతడి తల్లిగా కనిపించారు. మళ్లీ తెలుగు సినిమాలు చేయలేదు. ప్రస్తుతం ఆమె తమిళంలో సీరియల్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు పంచుకుంటుంటారు.