టాలీవుడ్ అగ్రహీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ చాలాకాలం తర్వాత సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ పోటీకి రెడీ అయిపోయారు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి(జనవరి 12), చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య(జనవరి 13) సినిమాలు ఒక్కరోజు గ్యాప్ తో రిలీజ్ అవుతున్నాయి. అయితే.. చిరు, బాలయ్య సంక్రాంతి రేసులో పోటీపడటం కొత్తకాదు. ఇదివరకు చాలాసార్లు సంక్రాంతికి పోటీపడి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఈసారి భారీ అంచనాల మధ్య సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాగా.. రెండు సినిమాలను ఫ్యాన్స్ తెరకెక్కిస్తుండటం విశేషం.
బాలయ్య హీరోగా వీరసింహారెడ్డి మూవీని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా.. చిరుతో వాల్తేరు వీరయ్య మూవీని దర్శకుడు రవీంద్ర(బాబీ) రూపొందించాడు. వీరిద్దరూ ఆయా హీరోలకు ఫ్యాన్స్ గా గతంలో మరిచిపోలేని మెమోరీస్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సినిమాలు ఎన్ని రోజులు ఆడాయి? అనేదానికంటే.. ఎంత వసూల్ చేశాయి? అనేది ప్రధానాంశంగా మారింది. మరి బాలయ్య, చిరుల సినిమాలంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఆలోచించండి. అఖండ సినిమాతో బాలయ్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ఆల్రెడీ వీరిద్దరూ రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరారు. దీంతో ఇప్పుడు రిలీజ్ కాబోతున్న సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? అనేది చర్చనీయాంశంగా మారింది.
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. చిరు, బాలయ్య క్రేజ్ దృష్ట్యా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కాబట్టి.. తాజా సమాచారం ప్రకారం.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా వీరసింహారెడ్డి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ రూ. 73.3 కోట్ల బిజినెస్ జరిగింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రూ. 61.8 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 5 కోట్లు, ఓవర్సీస్ రూ. 6.5 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. అఖండ తర్వాత వస్తున్న సినిమా కావడంతో పైగా తమన్ సంగీతం, మైత్రి మూవీస్ వారి ప్రొడక్షన్ వీరసింహారెడ్డి మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.
ఇక వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే.. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ రాజా రవితేజ నటించడం విశేషం. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ రూ. 88 కోట్లు బిజినెస్ జరిగింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రూ. 72.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ 6.5 కోట్లు, ఓవర్సీస్ రూ. 9 కోట్లుగా జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో కూడా చిరు సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా.. మైత్రి మూవీస్ వారే సినిమాని ప్రొడ్యూస్ చేయడం మరో విశేషం. ఇదివరకు వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే ఈసారి ఇద్దరి హీరోల సినిమాలు ఊహించని స్థాయిలో బిజినెస్ జరుపుకున్నాయి. చూడాలి మరి.. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు జనాలను ఎలా అలరిస్తాయో! కలెక్షన్స్ ఎలా రాబట్టనున్నాయో! ఇక వీరసింహారెడ్డి, వీరయ్య సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
వాల్తేరు వీరయ్య , వీరసింహారెడ్డి సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్ లెక్కలు..
వీరసింహారెడ్డి బడ్జెట్ రూ.100 కోట్ల
వాల్తేరు వీరయ్య బడ్జెట్ రూ. 140 కోట్లు
Megastar Chiranjeevi Nandamuri Balakrishna#WaltairVeerayya #VeeraSimhaReddy #tollywood #telugucinema pic.twitter.com/EtYvlrc9hJ— telugucinematoday (@itstelugucinema) January 4, 2023