యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ..బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతోంది. ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్‌ను అందుకుంటున్నాడు ఈ డైనమిక్ హీరో. టాలీవుడ్‌లోకి ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈయన ఒక్కొ మెట్టు ఎక్కుతూ అగ్రహీరోల జాబితాలో చేరిపోయాడు. ఆ తర్వాత మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి అనే సినిమా చేశాడు. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన సినిమాగా గుర్తింపు పొంది రికార్డులను తిరగరాసింది.
ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత బాహుబలి సినిమాతో హాలీవుడ్ రేంజ్‌ను సైతం అందుకున్నాడు. ఇక విషయానికొస్తే..ఫేస్ బుక్‌ను ఎక్కువగా ఫాలో అవుతున్న స్ఠార్స్‌ల లీస్టులో ప్రభాస్ చేరిపోయాడు. 2.4 కోట్ల మంది ఫాలోవర్స్‌తో ప్రభాస్ టాప్ 10 లో కొనసాగుతున్నాడు. సౌత్ ఇండియా నుంచి ఈ ఫిట్‌ను సాధించిన ఏకైక హీరోగా నిలిచాడు ఈ రెబల్ స్టార్.
ఈక టాప్‌లో మాత్రం 5 కోట్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ముందు వరుసలో దూసుకెళ్తున్నారు సల్మాన్‌ఖాన్. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్స్ అయిన అక్షయ్ కుమార్, షారుఖ్, అమితాబ్‌లు ఉన్నారు. ఇక ప్రభాస్ ర్యాంక్‌తో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దీంతో ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్. సలార్ వంటి సినిమాలతో బీజీగా ఉన్నాడు.