‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలతో థియేటర్లలోకి వచ్చాడు కానీ ఫ్యాన్స్ ని అయితే సంతృప్తి పరచలేకపోయాడు. అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇక ఈ ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలోకి రానున్నాడు. వాటిలో అందరూ ‘సలార్’ గురించి యమ వెయిటింగ్. అదే టైంలో ‘ప్రాజెక్ట్ k’అనే సినిమాని కూడా డార్లింగ్ ప్రభాస్.. సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేయగా… అది కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
ఇక విషయానికొస్తే.. క్రితంతో పోలిస్తే సినిమాలు తీసే విషయంలో టాలీవుడ్ రేంజ్ మారిపోయింది. రాజమౌళి వేసిన దారిలో యంగ్ డైరెక్టర్స్ అందరూ చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రెంట్ కంటిన్యూ అవుతోంది. ఇలానే కొనసాగితే హాలీవుడ్ స్టాండర్డ్స్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదు. అయితే అది ఎంతో దూరంలో లేదని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రూవ్ చేసేందుకు రెడీ అయిపోయాడు. తాజాగా రిలీజ్ చేసిన ‘ప్రాజెక్ట్ k’ వీడియోనే అందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓ టైర్ కోసం వీడియో రిలీజ్ చేయడం.. బహుశా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైం.
టాలీవుడ్ లో కొన్నాళ్ల ముందు వరకు హీరోని బేస్ చేసుకుని కథలు రాసేవారు. ఇప్పుడు లీడ్ రోల్ కి ఎలివేషన్స్ ఇస్తూనే, కంటెంట్ తోనూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలాంటి డైరెక్టర్స్ లో నాగ్ అశ్విన్ ఒకరు. ‘మహానటి’ లాంటి అద్భుతమైన సినిమా తర్వాత ప్రభాస్ తో ‘ప్రాజెక్టు k’ తీస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు. సినిమాలో చూపించి ప్రతి చిన్న వస్తువు కోసం చాలా శ్రమిస్తున్నారు. స్క్రాచ్ ఎపిసోడ్ 1 పేరుతో తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఓ టైర్ కోసం టీం అంతా ఎంత కష్టపడుతుంది అనేదాన్ని కాస్త ఫన్నీవేలో చూపించారు. సినిమాపై ఇది ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.
సాధారణంగా హాలీవుడ్ లోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం చాలా టైం తీసుకుంటారు. ఇప్పుడు ‘ప్రాజెక్ట్ k’ కోసం మూవీ టీమ్ పడుతున్న కష్టం చూస్తున్నా సరే అదే అనిపిస్తుంది. అలానే కొన్ని డౌట్స్ కూడా రైజ్ చేస్తుంది. ఎందుకంటే ఓ బండి చక్రం కోసం ఇంతలా చెబుతున్నారంటే.. స్టోరీలో ఈ చక్రం, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఛాన్సుందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా.. టైమ్ ట్రావెల్ బేస్ చేసుకుని తీస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. మరి ‘ప్రాజెక్ట్ k’టీమ్ రిలీజ్ చేసిన వీడియో చూసిన తర్వాత మీకెమనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.