డార్లింగ్ ప్రభాస్ అనేది పేరు కాదు వరల్డ్ వైడ్ గా అందరికీ తెలిసిన బ్రాండ్. ‘బాహుబలి’తో తనకంటూ ఓ రేంజ్ సెట్ చేసుకున్న ప్రభాస్.. ఆ తర్వాత దాన్ని పెంచుకోవడంలో తడబడుతున్నాడు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ మూవీస్ చేశాడు కానీ ప్రేక్షకుల నుంచి మాత్రం ఓ మోస్తరుగానే రెస్పాన్స్ వచ్చింది. తప్పితే సంతృప్తి పరచలేకపోయాడు. ఆ లోటుని తీర్చడానికా అన్నట్లు ‘సలార్’ రెడీ అవుతోంది. ప్రభాస్ లాంటి కటౌట్ కి సరిగ్గా సెట్ అయ్యే స్టోరీ ఇది. దానికి తోడు ‘కేజీఎఫ్’తో కేక పుట్టించిన ప్రశాంత్ నీల్.. ఈ మూవీకి డైరెక్టర్. అయితే ఈ సినిమా గురించి పక్కనబెడితే మరో క్రేజీ న్యూస్ ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.
ఇక విషయానికొస్తే.. ప్రభాస్ మూవీ లైనప్ చాంతాడంత పెద్దగా ఉంది. ఇప్పుడు ఒప్పుకొన్న సినిమాలన్నీ కంప్లీట్ చేసేటప్పటికీ.. తక్కువలో తక్కువ అనుకున్నా సరే మరో పదేళ్లు పడుతుంది. అంత బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్టు K’,’ఆదిపురుష్’ సినిమాలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ ఏడాది కాలంలోనే రిలీజ్ కానున్నాయి. ఇది కాకుండా ప్రభాస్ ఒప్పుకొంటున్న సినిమాల లిస్టు కూడా పెరుగుతూనే ఉంది. రీసెంట్ గానే మైత్రీ మూవీ మేకర్స్.. ప్రభాస్- బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కాంబో లో సినిమా ఉండదని చెప్పారు.
ఇక తాజాగా ‘వారసుడు’ ప్రమోషన్స్ లో పాల్గొన్న దిల్ రాజు.. తన నిర్మాణంలో తీయబోయే కొన్ని సినిమాల గురించి వెల్లడించారు. అందులో మోహనకృష్ణ ఇంద్రగంటితో ‘జయతు’, శైలేష్ కొలనుతో ‘విశ్వంభర’, ప్రశాంత్ నీల్ తో ‘రావణం’ మూవీస్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ లిస్టులో ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘రావణం’.. ప్రభాస్ తో చేయనున్నారని తెలుస్తోంది. అలానే ‘బాహుబలి’ తరహాలో పీరియాడికల్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తారని, అది కూడా భారీస్థాయిలో ఉండబోతుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బాక్సాఫీస్ బద్దలైపోవడం గ్యారంటీ. మరి ‘బాహుబలి’ లాంటి సినిమాను ప్రభాస్ చేస్తే చూడాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.
‘RAVANAM’#Prabhas – #PrashanthNeel – #DilRaju pic.twitter.com/uSlr3oXHcL
— Fukkard (@Fukkard) January 16, 2023