బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత అతడు చేసినవన్ని భారీ బడ్జెట్ చిత్రాలే. సాహో, రాధే శ్యామ్ సినిమాలన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలు రెండు బాక్సాఫీస్ వద్ద అనుకున్న మేర విజయం సాధించలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్, డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్ని ఉన్నది ఆదిపురుష్ చిత్రం మీదనే. దసరా పండుగ సందర్భంగా ఆది పురుష్ టీజర్ విడుదల అయ్యింది. ఎంతో ఆశగా.. ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఈ టీజర్‌ను చూసి షాకయ్యారు. ఇదేంటి ప్రభాస్ లాంటి స్టార్ హీరోను పెట్టి.. ఏకంగా కార్టున్ చిత్రం తీస్తారా.. అంటూ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు ఫ్యాన్స్. ఇక సినిమా మీద ఓ రేంజ్‌లో ట్రోల్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా రావణుడి లుక్‌పై వివరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఆది పురుష్ సినిమాపై అప్పటి వరకు ఉన్న అంచనాలు ఒక్కసారిగా రివర్స్ కావడంతో.. సంక్రాతి బరి నుంచి తప్పుకుంది.
అంతేకాదు ఈ సినిమాలోని ప్రధాన పాత్రల చిత్రీకరణపై కూడా పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఆదిపురుష్ టీం వీఎఫ్‌ఎక్స్ వర్క్ మళ్లీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ సర్కిళ్లల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆది పురుష్ సినిమా కోసం 450 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీఎఫ్‌ఎక్స్ వర్క్ మళ్లీ చేయడం కోసం అదనంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అంటే.. సినిమా బడ్జెట్ 550 కోట్లు ఖర్చు అవుతోంది. మరి ఇంత బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రం ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి. అయితే ఈ వార్త విని ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఈసారి అయినా కాస్త మంచిగా వర్క్ చేయండి.. లేదంటే తీవ్ర నష్టం తప్పదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక వీఎఫ్‌ఎక్స్ పనులను మళ్లీ చేయడానికి నిర్ణయించుకోవటంతో ఆది పురుష్ సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే సక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఆదిపురుష్ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు ఆది పురుష్ రిలీజ్ మరింత ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు. ఇక రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాను త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.