సాధారణంగా హీరోయిన్లు అందంగా ఉండాలని, తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటూ ఇండస్ట్రీలో ఎక్కువకాలం పాటు కొనసాగాలని భావిస్తుంటారు. అయితే కొంతమంది తమ సహజమైన అందంతోనే అవకాశాలను రాబట్టుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగతుంటారు. మరికొందరు మాత్రం మరింత అందంగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకుంటారు. అలా ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఇలాంటి సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే సంబంధించింది ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాను మరింత అందంగా కనిపించడం కోసం పూజా హెగ్డే.. తన బాడీలోని ఓ పార్ట్ కి సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమా ద్వారా కన్నడ భామ పూజా హెగ్డే టాలీవుడ్ కి పరిచయమైంది. కెరియర్ మొదట్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ అనంతరం వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొన్నాళ్లపాటు కొనసాగింది. ఈ పొడుగు కాళ్ల సుందరి తెలుగు, తమిళ భాషలలో మాత్రమే కాకుండా హిందీలో కూడా సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. ఇలా వరుసగా కొన్ని సినిమాలు నిరాశపరిచనప్పటికీ పూజాకి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం పూజ హెగ్డే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం లభించింది.
ఇకపోతే గతకొంతకాలం నుంచి ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బుట్టబొమ్మ ముక్కు అందంగా లేదంటూ ఆమె స్నేహితులు సలహా ఇచ్చారంట. దీంతో ఈ అమ్మడు..తన ముక్కుకు సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైనట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇంకా సర్జరీ కూడా చేయించుకున్నట్లు వచ్చాయి. అయితే ఈ వార్తలపై పూజా హెగ్డే టీమ్ స్పందించింది. ఈ వార్తలలో ఏ విధమైనటువంటి నిజం లేదని, ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేశారు.పూజా హెగ్డే కొద్ది రోజులుగా హాలిడే వెకేషన్ కోసం వెళ్లారు. ఆమె ఎలాంటి సర్జరీ చేయించుకోలేదనీ పూజ టీమ్ క్లారిటీ ఇచ్చారు.