తెలుగు, తమిళం, హిందీ.. ఇలా భాషలతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. తన అందం, అభినయంతో కుర్రకారును తెగ ఊరిస్తున్న ఈ పొడుగు కాళ్ల సుందరి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో గ్యాప్ లేకుండా పని చేస్తోంది. అయితే ఈ హీరోయిన్ గురుంచి ఫిల్మ్ నగర్ లో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది.
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కభీ ఈద్ కభీ దివాళి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఫర్హద్ సామ్ జీ దర్శకత్వం వహిస్తుండగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా ఈ సినిమాలో వెంకటేష్ కు చెల్లిగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్గే నటించనుందనే వార్తలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ అభిమానులు కాస్త షాక్ కు గురవుతున్నారట.
ఇది కూడా చదవండి: Samuthirakani: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను Jr.NTR ముందే ఉహించాడు: సముద్రఖని
మరి నిజం ఈ ముద్దుగుమ్మ వెంకికి చెల్లెల్లిగా నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ మధ్యకాలంలో విడుదలైన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి సినిమాల్లో పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు అనుకున్నంత విజయాన్ని సాధించకపోవడంతో ఈ భామ కాస్త నిరాశలో ఉందట. మరి విక్టరీ వెంకటేష్ కు చెల్లిగా పూజా హెగ్డే నటించబోతుందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
