టాలీవుడ్ మెగాస్టార్ ఆయన. ఇన్నేళ్ల కెరీర్ లో ఆయన చూడని హిట్ లేదు. అందుకోని గౌరవం లేదు. ఎవరికీ సాధ్యం కాని విధంగా కోట్లాది మంది ఫ్యాన్స్ గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని స్థానం సంపాదించారు. ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తూ కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో అందివచ్చిన అవకాశాల్ని కరెక్ట్ గా ఉపయోగించుకున్న చిరు.. ఏళ్ల పాటు ఆ స్టార్ డమ్ ని నిలబెట్టుకున్నారు. ఇది అంత సులువు కాకపోయినప్పటికీ.. దాన్ని ప్రూవ్ చేసి చూపించారు. ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో ఘనతల్ని సాధించారు. ఫ్యాన్స్ తో బాస్ అని పిలిపించుకుంటున్నారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవికి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రారంభంలో చిరంజీవి చాలాకష్టాలు ఎదుర్కొన్నారు. అందుకే ప్రస్తుతం చిన్న హీరోలు చాలామందికి అండగా నిలుస్తున్నారు. అందుకే ఆయన అందరికీ బాస్ అయిపోయారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైనే ఇండస్ట్రీలో ఉన్న చిరు.. హీరోగా, అద్భుతమైన డ్యాన్సర్ గా, నిర్మాతగా సుధీర్ఘ ప్రయాణం ఆయనది. ఇక ఇన్నేళ్లపాటు ఆయన చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మక పురస్కారంతో గౌరవించింది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ట్వీట్ చేశారు.
గోవాలో ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) ఉత్సవాల సందర్భంగా చిరంజీవికి కేంద్రం.. ఈ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ-2022 అవార్డు దక్కినట్లు పేర్కొన్నారు. కేంద్రమంత్రి అనురాగ్ చేసిన ట్వీట్ పై చిరు కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ అవార్డు తనకు ప్రకటించినందుకు భారతప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. తనని ఎంతగానో ప్రేమించే అభిమానుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నారని చిరు రాసుకొచ్చారు. ఇక ఇప్పుడు ఇదే విషయమై ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేయడం విశేషం.’చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనా చాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్ని ఆదరణ చురగొన్నారు’ అని తెలుగులో ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) ప్రతిష్ఠాత్మకంగా అందించే ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2013లో భారత సినిమా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రారంభించారు. మొదటిసారి ఈ అవార్డును వహీదా రెహమాన్ అందుకోగా.. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్, సలీం ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, హేమా మాలిని, ప్రసూన్ జోషి లాంటి ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. తాజాగా ఈ పురస్కారాన్ని చిరు అందుకోవడం, ప్రధాని మోదీ ట్వీట్ చేయడం విశేషంగా మారింది.
చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు. https://t.co/yQJsWL4qs8
— Narendra Modi (@narendramodi) November 21, 2022
Greatly Delighted and Humbled at this honour, Sri @ianuragthakur !
My deep gratitude to Govt of India@MIB_India @IFFIGoa @Anurag_Office and all my loving fans only because of whom i am here today! https://t.co/IbgvDiyNNI— Chiranjeevi Konidela (@KChiruTweets) November 20, 2022
Congratulations to Sri Chiranjeevi garu on being conferred ‘INDIAN FILM PERSONALITY OF THE YEAR 2022’ award at the @IFFIGoa.
An actor par excellence with more than 150 films to his credit, he has enthralled film enthusiasts with his brilliant performances.@KChiruTweets pic.twitter.com/PPpBDarpBS
— G Kishan Reddy (@kishanreddybjp) November 20, 2022