అల్లు అర్జున్ సరసన పరుగు సినిమాలో కనిపించిన హీరోయిన్ షీలా కౌర్ గుర్తుందా. అమాయకమైన చూపు.. ఇంకా పసితనం పోని రూపు.. బెదురు బెదురుగా చూసే కళ్లు.. రెండు జడలతో.. సింపుల్ లంగా ఓణీలో పదారాణల తెలుగమ్మాయిలా కనిపించి.. కుర్రకారుకి గిలి గింతలు పెట్టింది. సినిమా విడుదల తర్వాత షీలా ఎందరో కుర్రాళ్లకు కలల రాణి అయ్యింది. బ్యాచిలర్స్ రూమ్‌లో ఆమె వాల్ పోస్టర్లు నిండిపోయాయి. ఆ తర్వాత అదుర్స్ సినిమాలో ఆమెని చూసిన వారంతా.. ఏంటి.. ఈమె ఆమెనా.. అని షాకయ్యారు. అల్ట్రా మోడ్రన్ లుక్‌లో.. అదరగొట్టింది షీలా. ఆమె టాలీవుడ్‌లో నటించింది తక్కువ సినిమాల్లోనే. కానీ ప్రేక్షకుల మనసులో చిర స్థాయిగా నిలిచిపోయింది షీలా.
తన కెరీర్‌లో మొత్తం 20 సినిమాల్లో నటించిన షీలా.. నవదీప్ సీతాకోక చిలుకా సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అయితే అల్లు అర్జున్ సరసన నటించిన పరుగు చిత్రంతో మంచి విజయం అందుకుంది. అమాయకమైన రూపు, అందంతో అభిమానులను ఆకట్టుకుంది. ఆ తర్వాత రాజు భాయ్, హలో ప్రేమిస్తారా, మస్కా, అదుర్స్ తదితర తెలుగు సినిమాలతో పాటు.. పలు తమిళ చిత్రాల్లోను నటించింది. ఇక షీలా చివరంగా 2011లో బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర సినిమాలో నటించింది. ఆ తర్వాత వెండితెర మీద కనిపించలేదు. ఈ క్రమంలో షీలా క్యాన్సర్ బారిన పడ్డారని.. అందుకే ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారని అప్పట్లో అనేక పుకార్లు వచ్చాయి. మరి ప్రస్తుతం షీలా ఎక్కడుంది.. ఏం చేస్తుంది అంటే..
ప్రస్తుతం షీలా మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. మూడేళ్ల క్రితం ఆమెకు ఓ వ్యాపారవేత్తతో వివాహం అయ్యింది. సడెన్‌గా పెళ్లి వార్త చెప్పి అందరికి షాక్ ఇచ్చింది షీలా. 2020లో.. కేరళకు చెందిన ఒక వ్యాపారవేత్త సంతోష్ రెడ్డితో ఆమె వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో.. చాలా సింపుల్‌గా వీరి వివాహం జరగింది. ప్రస్తుతం ఆమె భర్తతో కలిసి సూపర్ మార్కెట్ నడుపుతున్నట్లు తెలుస్తోంది.