తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. కెరీర్ బిగినింగ్ లో పెద్దగా హిట్స్ సాధించకున్నా.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ చిత్రం తర్వాత ప్రభాస్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక బాహుబలి సీరీస్ తో ఏకంగా జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్ నటించే సినిమాలపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో వచ్చిన సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘సాహెూ’ కాస్త నిరాశపరింది. అయితే ప్రభాస్ పై ఉన్న క్రేజ్ తో ఓపెనింగ్స్ అయితే గట్టిగానే అందుకున్నాడు. గతంలో ప్రభాస్ ఏడాదికి ఒక్క చిత్రంలో నటించేవాడు.. కానీ ఇప్పుడు వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాడు.
ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఫైనల్ అవుట్ మరికొన్ని రోజుల్లో సిద్ధమవుతుంది. టాలీవుడ్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ప్రభాస్., రాధాకృష్ణ చెప్పిన సీక్వెల్ పాయింట్ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ సీక్వెల్ ను పూర్తిగా సిద్ధం చేసిన తరువాత మరొకసారి చెప్పాలని కూడా అన్నాడట దర్శకుడు.
ఇదిలా ఉంటే రాధేశ్యామ్ సినిమాను తెరకెక్కించడానికి రాధాకృష్ణ చాలా సమయం తీసుకున్నారు.. అప్డేట్స్ కూడా చాలా ఆలస్యం అయ్యాయి. ఇదే విషయంలో ప్రభాస్ అభిమానుల తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇక రాధేశ్యామ్ సినిమా రిజల్ట్ పై చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా మంచి నమ్మకంతోనే ఉన్నారట. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని కూడా అంటున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లలో అత్యధిక వ్యూవ్స్ అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక తమ అభిమాన హీరో ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ మూవీ రిలీజ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.