హీరోయిన్స్ అంటే సినిమాల్లోనే కనిపించాలి. పద్ధతిగా ఉండాలి అనే రోజులు ఎప్పుడో పోయాయి. కొద్దిమంది తప్పించి దాదాపు బ్యూటీస్ అందరూ.. తన గ్లామర్ ని ఎప్పటికప్పుడు షో చేస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్.. ఇండస్ట్రీలో ఉండేదే కొన్నేళ్లు. తమ క్రేజ్ ని కాపాడుకోవడంతో పాటు ఛాన్సులు దక్కించుకోవాలంటే అప్పడప్పుడు తమ అందాల్ని ప్రదర్శించాల్సి రావొచ్చు. ప్రస్తుతం అంతా టెక్నాలజీ యుగం కాబట్టి.. ఇన్ స్టా, యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేస్తే చాలు.. సదరు భామల ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలా ‘బాహుబలి’ బ్యూటీస్ అందాల ప్రదర్శనతో అదరగొట్టింది. చెప్పాలంటే సోషల్ మీడియా అంతా షేక్ చేసి పడేస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రెగ్యులర్ గా మూవీస్ చూసేవాళ్లకు నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పెషల్ సాంగ్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ‘బాహుబలి’ తొలి పార్ట్ లో ‘మనోహరి’ సాంగ్ లో వన్ ఆఫ్ ది బ్యూటీగా సందడి చేసింది. ఈ సినిమా తర్వాత పెద్దగా తెలుగులో సినిమాలు చేయనప్పటికీ.. హిందీలో మాత్రం చాలా ఫేమ్ సంపాదించింది. స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల మూవీస్ వరకు స్పెషల్ సాంగ్స్ చేస్తూ పాపులర్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో సుఖేష్ చంద్రశేఖర్ కేసు విషయమై వార్తల్లో నిలిచింది. ఇప్పుడిదంతా పక్కనబెడితే.. తాజాగా ఇన్ స్టాలో బీచ్ దగ్గర వయ్యారాలు ఒలకబోస్తున్న ఓ వీడియోని పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో నోరాని చూస్తే మీ నోరు తడారిపోవడం గ్యారంటీ! ఎందుకంటే గ్రీన్ కలర్ సింగిల్ పీస్ డ్రస్ లో బీచ్ దగ్గర గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిగొట్టే పోజుల్లో తెగ కవ్విస్తుంది. అలా అలా ఒడ్డున నోరా నడుస్తుంటే.. మీరైతే బీచ్ ని అస్సలు చూడరు. ఇదే కాదు గతంలో ఆమె చేసిన పోస్టులు చాలావరకు ఈ తరహాలోనే ఉంటాయి. నెటిజన్స్ కి ఫుల్ బిర్యానీ తిన్నంతగా పొట్ట నింపేస్తాయి. ఏదైతేనేం.. నోరాని ఈ వీడియోలో చూసిన ఫ్యాన్స్, సెలబ్రిటీలు తెగ కామెంట్స్ పెడుతున్నారు. మరి నోరా ఫతేహిని ఈ రేంజులో చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.