నిత్యా మీనన్.. కథా ప్రధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదింకుంది. నటిగా, సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నిత్యా మీనన్.. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు దక్కించుంది. డబ్బు కోసం తాను సినిమాలు చేయడం లేదని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది నిత్యామీనన్. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్ప.. ఆమె సినిమాలు ఒప్పుకోదు. తన కెరీర్ ప్రాంరభం నుంచి.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. ముందుకు సాగుతోంది. చిలిపిదనం, అల్లరిచేష్టలతో పక్కింటి అమ్మాయిలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది నిత్యా మీనన్. తాజాగా నిత్యా మీనన్‌కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిలో ఆమె చేతిలో బిడ్డతో కనిపించారు. ఇంతకు ఆ బిడ్డ ఎవరు.. ఏంటి అనే వివరాలు..
నిత్యా మీనన్.. తాజాగా తిరుపతి వచ్చింది. జిల్లాలోని వరదయ్యపాలెం మండలంలోని బత్తలవల్లం గ్రామంలో గల కల్కి ఆశ్రమాన్ని సందర్శించింది. అనంతరం కాంభాగం గిరిజన ఆలయాన్ని దర్శించుకుంది. ఆ తర్వాత అక్కడ ఉంటున్న గిరిజన ప్రజలతో కాసేపు గడిపింది. వారితో మాట్లాడుతూ.. ఓ మహిళ చేతిలో ఉన్న చంటి బిడ్డను ఎత్తుకొని లాలించింది నిత్యా మీనన్. గిరిజన పిల్లలు తన చుట్టూ చేరి.. పాట పాడుతుంటే ఆ బిడ్డను తన చేతుల్తో ఎత్తుకొని ఆడించింది నిత్యామీనన్. ఈ సందర్భంగా తీసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నిత్యామీనన్.. వారం రోజుల పాటు ఈ ఆశ్రమంలోనే బస చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రజలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుందని సమాచారం.
ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో నిత్యామీనన్ చివరిసారిగా పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ‘వండర్ విమెన్’తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అంజలి మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో నిత్యం మీనన్ బేబీ బంప్ ఫోజుతో షేర్ చేసిన ఫోటో ఒకటి తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, అది షూటింగ్ కోసమే చేసిందని ఆ తర్వాత తేలింది. మరి నూతన సంవత్సర వేడుకల కోసం సెలబ్రిటీలంతా విదేశాలకు వెళ్తుంటే.. నిత్యామీనన్ మాత్రం.. ఇలా సామాన్యులతో కలిసి గడపాలని తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి