బాల్యం ఓ మధుర జ్ఞాపకం. ఎలాంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు లేకుండా చాలా హాయిగా గడిచిపోయింటుంది. పసితనంలో ప్రతి ఒక్కరికీ ఎన్నో మధురానుభూతులు ఉంటాయి. చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చిన ప్రతిసారీ కూడా ఏదో ఓ తెలియని అద్భుతమైన అనుభూతి మనకు అనిపిస్తుంది. చిన్ననాటి ఫొటోలు మనవి మనం చూసుకుంటే ఆ జ్ఞాపకాల్లో విహరిస్తాం. మనవి మాత్రమే కాదు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్స్ కు ఉన్న చాలామంది సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ కూడా తెగ మురిసిపోతుంటారు. తమ అభిమాన తారలు చిన్నప్పుడు ఇలా ఉండేవారా అని తెగ ఆనందపడిపోతుంటారు. ఇప్పుడు కూడా అలానే ఓ బ్యూటీకి సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటో ఒకటి వైరల్ గా మారింది. మరి ఆమెని ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన మెగాస్టార్ ఎత్తుకున్న పాప నిహారిక కొణిదెల. మెగాబ్రదర్ నాగబాబు కూతురు అయిన ఈమె పుట్టినరోజు నేడు. ఆమెకు పలువురు అభిమానులు, సెలబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె చిన్నప్పటి ఫొటో వైరల్ గా మారింది. నటి కాకముందు ఢీ జూనియర్ 1,2 సీజన్స్ కి యాంకర్ గా చేసింది. చాలా ఫేమ్ తెచ్చుకుంది. ఇది చేస్తున్న టైంలోనే యూట్యూబ్ లో ‘ముద్దపప్పు ఆవకాయ’ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇది ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అలా ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఒరు నల్లా నాల్ పాతు సొల్రన్’ అనే తమిళ సినిమాలోనూ యాక్ట్ చేసింది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. మెగాస్టార్ చిరంజీవి చేసిన ‘సైరా’ మూవీలోనూ అతిథి పాత్రలో కనిపించి మెప్పించింది.
ఇక 2020లో పెళ్లి చేసుకున్న నిహారిక.. సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్ లాంటి వెబ్ సిరీస్ లు తీసింది. ఈ రెండు కూడా జీ5 ఓటీటీలో రిలీజై, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. నిర్మాతగా నిహారికకు కూడా మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక నిహారిక వ్యక్తిగత విషయానికొస్తే.. చైతన్య జొన్నలగడ్డ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని పెళ్లి చేసుకుంది. వివాహబంధంలోకి అడుగుపెట్టిన తర్వాత.. ఓవైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే మరోవైపు విదేశాలను చుట్టేస్తూ లైఫ్ లో ప్రతిక్షణాన్ని ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు తన పుట్టినరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. మరి నిహారిక చిన్నప్పటి ఫొటోని ఎంతమంది గుర్తుపట్టారు. క్రింద కామెంట్ చేయండి.