రాజమౌళి రేంజ్ వేరు. ఇండియాలోనే టాప్ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఆయన మేమ్ ఫేమస్ అనే సినిమా గురించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు నెటిజన్స్ కి నచ్చడం లేదు.
యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా చేసిన మూవీ మేమ్ ఫేమస్. మే 26న విడుదలైన ఈ సినిమాతో దాదాపు 30 మంది కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాపై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మహేష్ బాబు, రాజమౌళి సైతం సినిమా బాగుందని కొనియాడారు. ఐతే ఇదే ఇప్పుడు ఆయన అభిమానులకు నచ్చడం లేదు. ఈ విషయంలో నెటిజన్స్ రాజమౌళిపై కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి సార్ మీకు ఇలాంటి పనులు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చాలా కాలం తర్వాత థియేటర్ లో ‘మేమ్ ఫేమస్’ సినిమా చూసి పూర్తిగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా సుమంత్ కోసం చూడండి. నటుడిగా, దర్శకుడిగా ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమాలో అన్ని పాత్రలు బాగున్నాయి, అందరూ సహజంగా నటించారు. ముఖ్యంగా అంజి మామ. ప్రతి ఒక్కరికీ ఈ సినిమాని అధికంగా రికమండ్ చేస్తున్నా. యూత్ ని ఎంకరేజ్ చెయ్యాలే. దం దం చేయద్దు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి చాలా మంది సినిమా బాగుందని థియేటర్స్ కి వెళ్లారు. రాజమౌళి అంతటి వ్యక్తి ఒక సినిమా చూసి బాగుంది అన్నారంటే ఆ సినిమా నిజంగానే బాగుంటుందన్న నమ్మకం ఉంది జనాలకు. ఐతే సినిమా చూసిన వారు రాజమౌళి చెప్పినంతగా ఏమీ లేదని కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా బాగుంది కానీ రాజమౌళి ప్రత్యేకించి మరీ ట్వీట్ వేసేంతగా సినిమా లేదని నెటిజన్స్ అంటున్నారు. మీరు కూడా విశ్వసనీయత లేని ట్వీట్స్ వేస్తారేంటి సార్ అని కామెంట్స్ చేస్తున్నారు. మీ స్థాయి వేరు సార్, తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిన మీరు ఇలాంటి సినిమాలను ప్రమోట్ చేయవలసిన అవసరం లేదు సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే రాజమౌళి స్థాయి వేరు. తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం తీసుకొచ్చిన దర్శక దిగ్గజం. అలాంటి ఆయన చిన్న సినిమాలను పట్టించుకునేంత అవసరం, తీరిక ఉండవు. కానీ అంత గొప్ప దర్శకుడు అయినా కూడా అవకాశం ఉన్నప్పుడల్లా చిన్న సినిమాలను చూసి బాగుందని చెప్పి ప్రమోట్ చేస్తుంటారు. ఆయన కూడా ఒకప్పుడు సీరియల్ ద్వారా వచ్చిన వారే కదా. అందుకే ప్రతిభావంతులను గుర్తించి వారిలో ఉత్సాహాన్ని నింపుతుంటారు. అలానే ఇప్పుడు కూడా మేమ్ ఫేమస్ సినిమా నటులను, సినిమాని ప్రమోట్ చేస్తున్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.