నారా రోహిత్ కొత్త సినిమా సుందరకాండ వినాయక చవితి పురస్కరించుకుని రేపు ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ఫస్ట్ రివ్యూ ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ మొత్తం సినిమాను నడిపిస్తుందనే టాక్ విన్పిస్తోంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
నారా రోహిత్ హీరోగా కొత్త దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కించిన సుందరకాండ సినిమాపై టాలీవుడ్‌లో బజ్ క్రియేట్ అవుతోంది. రేపు ఆగస్టు 27న ధియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రీమియర్ షో చూసిన జనం నుంచి వస్తున్న ఫస్ట్ రివ్యూ సినిమాపై అంచనాలను పెంచుతోంది. మొదటి సినిమానే అయినే ఎక్కడా ఎలాంటి పొరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా తీసినట్టు టాక్. కాబోయే భార్యలో ఉండాల్సిన ఐదు లక్షణాలేంటి, అలాంటి అమ్మాయి కోసం హీరో చేసే అణ్వేషణ చుట్టూ సినిమా సాగుతుంది.
ఇంటర్వెల్ సీన్ హైలైట్
సుందరకాండ సినిమాలో ఇంటర్వెల్ సీన్ చాలా హైలైట్ అని తెలుస్తోంది. సినిమా ఇక్కడి నుంచి ఎవరూ ఊహించని మలుపు తిరుగుతుందట. సినిమాలో ఇదే అతిపెద్ద ట్విస్ట్ అంటున్నారు. ఇంటర్వెల్ సీన్ చూసి ఆడియన్స్ షాక్ అవుతారంటున్నారు. చాలాకాలంగా హిట్ కోసం చూస్తున్న నారా రోహిత్‌కు ఈ సినిమా లాభించవచ్చంటున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా చూడాల్సిన సినిమా అంటున్నారు.
ఈ సినిమా రన్‌టైమ్ కేవలం 2.15 గంటలు మాత్రమే. నారా రోహిత్‌తో పాటు శ్రీదేవి, వృతి వాఘాని, నరేష్, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, రఘుబాబులు సినిమాలో నటించారు. సంతోష్ , గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సినిమాను నిర్మించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. కామెడీ ప్రధానంగా సాగే లవ్ స్టోరీ కావడంతో అందరికీ నచ్చుతుందంటున్నారు నిర్మాతలు.