తెలుగు సినీ, రాజకీయ ప్రస్థానంలో నందమూరి కుటుంబానిది ప్రత్యేక స్థానం. తెలుగు తెర మీద.. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా వెలిగిన నందమూరి తారకరామరావు.. తెలుగు వాడి ఆత్మ గౌరవ నినాదం పేరుతో తెలుగు దేశం పార్టీ స్థాపించి.. అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. నేటికి కూడా ఆయన వారసులు.. ఇటు సినీ రంగంలోను, అటు రాజకీయ రంగంలో నంబర్ వన్‌గా కొనసాగుతున్నారు. నందమూరి కుంటుంబ నుంచి హీరోగా వచ్చిన వారిలో తారక రత్న ఒకరు. ప్రారంభంలో వరుస సినిమాలు చేసిన ఆయన.. ఆ తర్వాత ఇండస్ట్రీకి కొంత కాలం దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. 9 అవర్స్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో తాజాగా సుమన్ టీవీ.. నందమూరి తారకరత్నతో ఎక్స్‌క్లూజీవ్‌గా ఇంటర్వ్యూ నిర్వహించింది.
ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తనకు, నందమూరి కుటుంబానికి మధ్య ఎలాంటి దూరం లేదని.. తాను జూనియర్‌కి పోటీగా ఇండస్ట్రీలోకి రాలేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తనకు తెలుగు ముఖ్యమంత్రుల్లో తన తాత ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడుతో పాటు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఎంతో అభిమానం అని తెలిపారు. వారంతా ఓ సిద్ధాంతం కోసం కట్టుబడి.. పార్టీని ముందుకు తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. ఇక వైఎస్సార్ కుటుంబంలో ఉన్న వివాదాల గురించి తనకు ఏమి తెలియదని.. అలాంటప్పుడు దాని గురించి మాట్లాడటం సభ్యత కాదని తెలిపారు. నందరమూరి తారకరత్న చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.