సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానుల కడచూపు కోసం ఉంచారు. ఆయన భౌతికకాయానికి పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. సిరివెన్నెల పార్థీవదేహాన్ని పలువురు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన హీరో నందమూరి బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. సిరివెన్నెల గురించి మాట్లాడుతూ ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇది ఒక నమ్మలేని నిజం… ఏం మాట్లాడాలో తెలియట్లేదు.
తెలుగు భాష, సాహిత్యానికి సిరివెన్నెల ఒక భూషణుడు. ఎవరైతే కుటుంబానికి, పుట్టిన ఊరికి, జాతికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొస్తారో… వాళ్లు ఉన్నా లేకున్నా శాశ్వతంగా మిగిలిపోతారు. ఇది ఒక నమ్మలేని నిజం… ఏం మాట్లాడాలో తెలియట్లేదు. తెలుగు భాష, సాహిత్యానికి సిరివెన్నెల ఒక భూషణుడు. ఎవరైతే కుటుంబానికి, పుట్టిన ఊరికి, జాతికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొస్తారో… వాళ్లు ఉన్నా లేకున్నా శాశ్వతంగా మిగిలిపోతారు. ఆయన మరణం తెలుగు పరిశ్రమకు తీరని లోటని అభివర్ణించారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అభిప్రాయపడ్డారు.