జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మరణవార్త తెలుగు చిత్ర పరిశ్రమను కలచివేస్తోంది. ఈ విషయంపై యంగ్ హీరో నాగశౌర్య స్పందించారు.
టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్య కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేస్తారని ఆయనకు పేరుంది. అమ్మాయిల్లో ఈ యువ హీరోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈమధ్య కాలంలో శౌర్యకు సరైన హిట్ పడలేదు. ఈసారి ఎలాగైనా మంచి హిట్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆయన అనుకుంటున్నారు. ఈ క్రమంలో నాగశౌర్య చేసిన చిత్రమే ‘రంగబలి’. ఈ ఫిలిం ట్రైలర్ ఇవాళ రిలీజైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ‘రంగబలి’ మూవీ యూనిట్ పాల్గొంది. సినిమా విశేషాలను చిత్ర యూనిట్ పంచుకున్నారు. అయితే ఇదే సందర్భంగా హీరో నాగశౌర్యకు జర్నలిస్టుల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ఇటీవల ఒక అబ్బాయి రోడ్డు మీద ఓ అమ్మాయిని ఏడిపిస్తుంటే.. మధ్యలో నాగశౌర్య కలుగజేసుకున్నారు. ఈ అంశం గురించి ఎట్టకేలకు నాగశౌర్య క్లారిటీ ఇచ్చారు.
ఆ రోజు జరిగిన ఘటనలో ఆ అమ్మాయిదే తప్పు అని నాగశౌర్య అన్నారు. ఆ అబ్బాయిని తాను కొట్టలేదన్నారు. అమ్మాయిని ఎందుకు కొడుతున్నావని అబ్బాయిని అడిగితే.. ఆ అమ్మాయి సమాధానం విని తాను షాక్‌కు గురయ్యానని నాగశౌర్య చెప్పారు. తన బాయ్‌ఫ్రెండ్ కొడితే కొడతాడు.. చంపితే చంపుతాడు అని ఆ అమ్మాయి చెప్పిందన్నారు. మ్యారేజ్ చేసుకునే అమ్మాయిలకు తాను ఒకటే చెబుతున్నానని.. కొట్టే అబ్బాయిల్ని మాత్రం పెళ్లి చేసుకోవద్దు అని నాగశౌర్య పేర్కొన్నారు. తాను ప్రచారం కోసం కావాలనే ప్లాన్ చేసి, అది క్రియేట్ చేశానని కొందరు అన్నారని నాగశౌర్య తెలిపారు. ఇక, ప్రేమ విషయంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకరు సూసైడ్ చేసుకొని చనిపోయిన విషయాన్ని నాగశౌర్య ప్రస్తావించారు. లైఫ్‌లో ఏం సాధించలేకపోతున్నానని అలా సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు అని ఆయన చెప్పుకొచ్చారు.