నేడు పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. దీంతో ఆయనకు టాలీవుడ్ లోని ప్రముఖలు పుట్టిన రోజు విషెష్ తెలియజేశారు. డైరెక్టర్స్, నిర్మాతలే కాకుండా హీరో హీరోయిన్ లు కూడా ప్రభాస్ కి బర్త్ డే విషెష్ తెలిపారు. స్వీటి అనుష్క కూడా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ విష్ చేసింది. అయితే ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే.
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికాపదుకునే నటిస్తోంది. అయితే ఈ మూవీ యూనిట్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా విషెష్ తెలిపింది. సూపర్ హీరోకి.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రాజెక్ట్ Kసెట్స్ కి మిమ్మల్ని స్వాగతిస్తున్నందుకు మేము సూపర్ ఎగ్జైటింగ్ గా ఉన్నామంటూ మూవీ యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాను నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.
