మల్టిప్లెక్స్ థియేటర్లలో సినిమా టికెట్ల ధరలు భారీగా ఉంటాయి. దీంతో రేట్లకు భయపడి చాలామంది ఆ థియేటర్లలో సినిమాకి వెళ్లాలంటేనే వెనకడుగు వేస్తారు. అయితే తెలంగాణలో మల్టిప్లెక్స్ థియేటర్లలో టికెట్ల రేట్ల విషయానికోస్తే భారీగా ఉంటాయి. ఇలాంటి మల్టిప్లెక్స్ థియేటర్లలో సినిమాకి వెళ్లాలంటే సామాన్య ప్రజలు భయపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే మల్టిప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం టికెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల టాలీవుడ్ నిర్మాతలు సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు థియేటర్లకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దీంతో వెంటనే టికెట్ల రేట్లు అమాంతంగా పెంచారు థియేటర్ల యజమానులు. అలా పెంచిన కొన్ని రోజులకే పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో మల్టిప్లెక్స్ థియేటర్ల యజమానులు డైలమాలో పడి చివరికి మళ్లీ టికెట్ల రేట్లు తగ్గించినట్లుగా తెలుస్తోంది. తీసుకున్న తాజా నిర్ణయంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తగ్గిన సినిమా టికెట్ల ధరలు రేపటి నుంచి విడుదలయ్యే సినిమాలకి వర్తిస్తాయని తెలిపింది.ఇది కాక సంక్రాంతి బరి నుంచి పాన్ ఇండియా సినిమాలైన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి భారీ చిత్రాలు తప్పుకున్నాయి. దీంతో చిన్న సినిమాలైన బంగర్రాజు మరి కొన్ని సినిమాలు పొంగల్ కు రిలీజ్ కానున్నాయి. అయితే చిన్న సినిమాలకు మల్టిప్లెక్స్ థియేటర్లలో అంత ధర పెట్టి చాలా మంది సినిమాకు రారని భావించి మల్టిప్లెక్స్ థియేటర్ల యజమానులు టికెట్ల రేట్లను తగ్గించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మల్టిప్లెక్స్ థియేటర్లలో టికెట్ల ధరలు రూ.200,రూ.175,రూ.150 గా ఉన్నాయి.