మోనాల్ గజ్జర్..బిగ్‌బాస్ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. బిగ్‌బాస్ నుంచి అడుగు బయట పెట్టిన మరో క్షణమే వరుస ఆఫర్లతో తడిసిపోయింది. తన అందం అభినయంతో కుర్రకారును ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది ఈ గుజరాత్ భామ. స్టార్ మాలో ఓ షో హోస్ట్‌గా చేసింది మోనాల్. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన చిత్రం అల్లుడు అదుర్స్. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో శ్రీనివాస్‌తో ఆడిపాడింది ఈ సుందరి.
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మకు మరో అదిరిపోయే ఆఫర్ అందినట్లు సమాచారం. నాగార్జున హీరోగా కల్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో నాగార్జునకు జోడిగా మళ్లీ రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో మోనాల్‌కు స్పెషల్ సాంగ్‌తో అవకాశం వచ్చినట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఓ ప్రత్యేక సాంగ్ కోసం మోనాల్‌ను సంప్రదించటంతో దీనికి మోనల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే ఈ సినిమాకు మోనాల్ ఓకే చెప్పిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.