‘ఆయన వాచ్ అమ్మితే మీ బ్యాచ్ మొత్తం సెటిలైపోవచ్చు’… ఇది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మూవీలోని డైలాగ్. సరేలే సినిమా కదా సరదాగా పెట్టారేమో అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం పలువురు తెలుగు స్టార్ హీరోల వాచీల కాస్ట్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ అంటే వాళ్లు ఏం చేసినా, ఏ వస్తువు ఉపయోగిస్తున్నా సరే ఫ్యాన్స్ గమనిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లే హీరోలు తమ ఫ్యాషన్ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. డ్రస్సింగ్ స్టైల్ నుంచి ప్రతిదీ చాలా జాగ్రత్తగా మెంటైన్ చేస్తూ ఉంటారు. ఇక వాచీలు కూడా చాలా ఖరీదైనవి పెట్టుకుంటూ ఉంటారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా థియేటర్లలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ కొట్టేశారు. తన వింటేజ్ లుక్ గుర్తుచేసేలా ఉన్న ఈ సినిమా ప్రేక్షకుల్ని, మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించింది. డ్యాన్సులు, ఫైట్స్ తో దుమ్మురేపారు. ఈ ఊపులో ‘భోళా శంకర్’ షూటింగ్ లో బిజీగా మారిపోయారు. ఇక తాజాగా మెగాస్టార్ వాచీల కాస్ట్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ స్టార్ట్ అయింది. సినిమాల ఈవెంట్స్ లో పాల్గొనే టైంలో చిరు డిఫరెంట్ డిఫరెంట్ వాచీలతో కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ దృష్టి వాటిపై పడింది. ఆయా వాచీల రేటెంతో తెలుసుకునేందుకు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు.
అయితే చిరు ధరించిన వాటిలో రోలెక్స్ వాచ్ అత్యంత ఖరీదైనదని తెలుస్తోంది. రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ కాస్ట్ రూ. కోటి 86 లక్షల 91 వేల రూపాయలకు పైనే అని తెలుస్తోంది. చిరు దగ్గర మరో వాచ్ కూడా ఉంది. ఎ లాంగే అండ్ సోహ్నే వాచ్ అది. దీని ఖరీదు రూ.33 లక్షలకు పైనే అని తెలుస్తోంది. ఇలా సినిమాలతో మాత్రమే కాకుండా వాచీల కాస్ట్ తోనూ చిరు వార్తల్లో ఉంటున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే సరదాగా అత్తారింటికి దారేది డైలాగ్ తో ఫన్ జనరేట్ చేస్తున్నారు. మరి చిరు వాచీల ధరలు గురించి చూస్తుంటే మీకేం అనిపిస్తుంది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.