తెలుగు సినీ దిగ్గజం, సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటు కారణంగా ఆయన 80 ఏళ్ల వయసులో పరమపదించారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావటంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు అత్యవసర విభాగంలో ఉంచి..వైద్యులు చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణ గారి మృతితో సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. నటీనటులు శోక సముద్రంలో మునిగారు. కృష్ణ మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కృష్ణ గారి భౌతిక కాయాన్ని సందర్శించేందుకు ఆయన నివాసానికి పెద్ద ఎత్తున సినీ రాజకీయ ప్రముఖులు వెళ్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. కృష్ణ గారి పార్ధీవ దేహాన్ని సందర్శించారు.
సినీ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన సినిమాల్ని, తీపి గుర్తులుగా మిగిల్చి దివికేగారు మన సూపర్ స్టార్ కృష్ణ గారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఓ మహశిఖరాన్ని కోల్పోయింది. ఆయన మరణంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు శోక సముద్రంలో మునిపోయారు. ఆయన మరణానికి నివాళి అర్పిస్తూ, తెలుగు చిత్రసీమలో సెలబ్రిటీలు అందరూ ట్వీట్స్ పెడుతున్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని తదితరులు కృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇక కృష్ణగారి పార్ధీవ దేహాన్ని సందర్శించేందుకు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే దర్శకుడు రాఘవేంద్ర రావు, హీరో పవన్ కల్యాణ్, వెంకయ్యనాయుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు కృష్ణ గారి భౌతికకాయాన్ని సందర్శించారు. మెగాస్టార్ చిరంజీవి… కృష్ణ గారి పార్ధీవ దేహాన్ని సందర్శించారు. మహేష్ బాబును ఓదారుస్తూ ఆయన పక్కనే కొద్ది సమయం పాటు కూర్చున్నారు. కృష్ణ గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
. @KChiruTweets , @VenkyMama Consoling @urstrulyMahesh #SSKLivesOn #SuperStarKrishna #RIPSuperStarKrishnaGaru pic.twitter.com/fPq313MDKT
— Suresh Kondi (@SureshKondi_) November 15, 2022