ఇండస్ట్రీలో సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు రోజురోజుకూ సెట్స్ పైకి వెళ్తున్న సినిమాల సంఖ్యతో పాటు.. ఆల్రెడీ తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతున్న మూవీస్ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తీరా రిలీజ్ కావాల్సిన సినిమాలు ఎక్కువైపోవడం వలన బాక్సాఫీస్ వద్ద చిన్నాపెద్దా అనే తేడా లేకుండా క్లాషెస్ ఏర్పడుతున్నాయి. మార్చి నెల మొదలైంది కాబట్టి.. బిగ్ స్టార్స్ తో పాటు చిన్న సినిమాలు కూడా సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి.
ఇటీవల ఇండస్ట్రీలో సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు రోజురోజుకూ సెట్స్ పైకి వెళ్తున్న సినిమాల సంఖ్యతో పాటు.. ఆల్రెడీ తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతున్న మూవీస్ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తీరా రిలీజ్ కావాల్సిన సినిమాలు ఎక్కువైపోవడం వలన బాక్సాఫీస్ వద్ద చిన్నాపెద్దా అనే తేడా లేకుండా క్లాషెస్ ఏర్పడుతున్నాయి. అదీగాక ఇప్పుడు ట్రెండ్ ఎలా మారిందంటే.. రిలీజైన సినిమాలకు హిట్ టాక్ వస్తేనే జనాలు థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూస్తున్నారు. ఫలితం ఏమాత్రం అటు ఇటు అయినా.. పెద్దగా పట్టించుకోవట్లేదు. అంతేగాక.. రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య ఎక్కువైపోవడంతో ప్రేక్షకులు కూడా అన్ని సినిమాలు ఎక్కడ చూస్తామని.. ఓటిటిలో చూడొచ్చులే అని లైట్ తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో.. స్టార్ హీరో, కాస్ట్ ఏదైనా కాకుండా కంటెంట్ ప్రధానంగా సినిమాలను ఆదరిస్తున్నారు ఆడియెన్స్. కొన్నాళ్లుగా గమనిస్తే.. కంటెంట్ ఉన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదివరకు వారానికి ఒకటి లేదా రెండు సినిమాలు రిలీజ్ అయ్యేవి. కాలక్రమేణా జరిగిన మార్పుల వలన.. వరుసలు మారిపోయాయి. బడ్జెట్.. రిలీజ్ లేట్ అవుతున్నకొద్దీ పెరిగే ఖర్చులను దృష్టిలో పెట్టుకొని సినిమాలను పోటాపోటీగా రిలీజ్ చేసేస్తున్నారు. ఇక 2023ని వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, పఠాన్ సినిమాలు గ్రాండ్ గా స్టార్ట్ చేశాయి. ఫిబ్రవరిలో పద్మభూషణ్, సార్, VBVK సినిమాలు అలరించాయి. ఇప్పుడు మార్చి నెల మొదలైంది కాబట్టి.. బిగ్ స్టార్స్ తో పాటు చిన్న సినిమాలు కూడా సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. మరి మార్చిలో బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్న సినిమాలేంటో చూద్దాం!