ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. కరోనా కోరల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇండస్ట్రీకి వరుసగా గడ్డు పరిస్థితులు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో వరుస మరణాలు పరిశ్రమను తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఇటు టాలీవుడ్ లో.. అటు బాలీవుడ్ లో దర్శక, నటుల మరణాలు ఇండస్ట్రీలో విషాదచాయలను మిగుల్చుతున్నాయి. తాజాగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి మరణించింది. తన బైక్ పై శనివారం రాత్రి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
కోల్హాపూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సీరియల్ నటి దుర్మరణం చెందారు. కళ్యాణీ కురాలే జాదవ్.. ప్రముఖ మరాఠీ బుల్లితెర నటి. ఎన్నో సీరియల్లలో తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఈ క్రమంలో తాజాగా హలోండిలో ఓ రెస్టారెంట్ ను ప్రారంభించింది జాదవ్. శనివారం రాత్రి తన రెస్టారెంట్ ను మూసీవేసి ఇంటికి బయలుదేరింది. సాంగ్లీ-కొల్హాపూర్ హైవేపై హలోండి సమీపంలో జాదవ్ బైక్ ను కాంక్రీట్ మిశ్చర్ ను ఢీకొట్టింది. దాంతో కళ్యాణి జాదవ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.
కాగా కళ్యాణీ జాదవ్ తుజ్హత్ జీవ్ రంగా, దఖంచ రాజా జ్యతిబా వంటి పలు మరాఠీ సీరియల్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసి.. ఘటనపై విచారణ చేపట్టారు. కళ్యాణి కురాలే జాదవ్ మరణంతో మరాఠీ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది. నటి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నిన్న కూడా క్యాన్సర్ తో పోరాడుతూ.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాకేశ్ కుమార్ కన్నుమూసిన విషయం తెలిసిందే. మరో నటుడు కూడా జిమ్ లో వర్కౌట్ చేస్తు గుండెపోటుతో మరణించిన సంఘటనలు మరచిపోకముందే.. మరో విషాదం చలన చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేసింది.
#KalyaniKuraleJadhav was riding home after closing her restaurant when a tractor knocked her down from her two-wheeler near Kolhapur city.https://t.co/DhnVk6FAqA
— Express PUNE (@ExpressPune) November 14, 2022