షాయాజీ షిండే.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు పదేళ్లకు పైగా టాలీవుడ్‌లో నటుడగా రాణిస్తున్నాడు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో రాణించాడు. అయితే గత కొంత కొలంగా తెలుగు తెరకు దూరమయ్యాడు షాయాజీ షిండే. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ నటుడు ఓ వివాదంలో చిక్కకున్నాడు. తనను మోసం చేశాడంటూ.. ఓ దర్శకుడు షాయాజీ షిండేపై నిర్మాత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాలు.. మరాఠీ దర్శకుడు సచిన్ సనన్.. షాయాజీ షిండే.. తనను మోసం చేశాడని.. తన సినిమాలో యాక్ట్ చేసేందుకు రూ.5 లక్షలు తన వద్ద తీసుకుని.. చివరికి తనను మోసం చేసినట్లు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా షిండే కారణంగా రూ.17 లక్షల్ని తాను నష్టపోయినట్లు కూడా ఈ సందర్భంగా తెలిపాడు.
సచిన్ సనన్.. తన మరాఠి సినిమా ‘గిన్నాద్’లో ఓ రోల్ కోసం షాయాజీ షిండేని సంప్రదించానని తెలిపాడు. తాను చెప్పిన కథ విన్న షాయాజీ షిండే.. తన సినిమాలో యాక్ట్ చేసేందుకు ఒప్పుకున్నాడట. కానీ.. ఆ తర్వాత అతడు ఇచ్చిన డేట్స్‌లో షూటింగ్‌కి రాలేదని తెలిపాడు. ఎందుకు అని కారణం అడిగితే సరైన సమాధానం చెప్పలేదని సచిన్ సనన్.. తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత రోజు షూటింగ్‌కి వచ్చిన షాయాజీ షిండే.. స్క్రిప్ట్ మార్చమని సెట్‌లో గొడవ చేసి వెళ్లిపోయినట్లు సచిన్ సనన్ చెప్పుకొచ్చాడు.
అంతేకాక ఈ సినిమాలో యాక్ట్ చేసేందుకు తాను.. షాయాజీ షిండేకి రూ.5 లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చానని.. అతను వెళ్లిపోవడంతో షూటింగ్ ఆగిపోయినందుకు తాను మొత్తం మీద సుమారు.. రూ.17 లక్షలు వరకూ నష్టపోయినట్లు సచిన్ సనన్ వెల్లడించాడు. ఈ మొత్తం షాయాజీ షిండే నుంచి ఇప్పించాలని పోలీస్ స్టేషన్‌తో పాటు అఖిల భారత మరాఠీ ఫిల్మ్ కార్పొరేషన్‌లోనూ ఫిర్యాదు చేశాడు. తాను పోలీసు స్టేషన్‌కు వెళ్లాలని అనుకోలేదని.. పర్సనల్‌గానే సెటిల్ చేసుకోవాలని భావించానని.. కానీ షాయాజీ షిండే.. తన కాల్స్ లిఫ్ట్ చేయడం లేదని తెలిపాడు. మధ్యవర్తి ద్వారా తన డబ్బులు తనకు ఇవ్వమని అడిగిపిస్తే.. అందుకు కూడా సరైన సమాధానం చెప్పలేదని ఈ సందర్భంగా సచిన్ సనన్ చెప్పుకొచ్చాడు. అందుకే తప్పని పరిస్థితుల్లో.. పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపాడు.
మరి ఈ ఫిర్యాదుపై షాయాజీ షిండే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇక తెలుగులో షాయాజీ షిండే పలు చిత్రాల్లో భిన్నమైన పాత్రల్ని పోషించాడు. పోకిరీ సినిమాలో పోలీస్ ఆఫీసర్.. ఠాగూర్‌లో విలన్.. అల్లరి నరేష్ యముడికి మొగుడులో యముడి పాత్రలో నటించాడు. అలానే అరుంధతి సినిమాలో అతను పోషించిన ‘అన్వర్’ పాత్ర షాయాజీ షిండేకి ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది.