టాలీవుడ్ నటుడు మా అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సంవత్సరం జరగబోయే మా ఎన్నికలపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ విష్ణు నిర్ణయం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే.. మా ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ అధ్యక్షపదవుల కోసం పోటి పడ్డారు. ఈ ఎన్నికల సమయంలోనే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. వీరి మధ్య మాటల యుద్దమే జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రకాష్ రాజ్ ఎన్నికల జరిగిన తీరును విమర్శిస్తూ తమ మా సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఆ రెండు రోజుల వ్యవధిలోనే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరపున నిలబడిన 11 మంది సభ్యులు కూడా రాజీనామ చేశారు. ఆ తర్వాత తామందరం ఒక్కటే అని ప్రెస్ మీట్ లో చేప్పుకొచ్చారు మంచు విష్ణు.
వచ్చే మే లేదా జూన్‌లో మా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు అయన పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా సభ్యలకు ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ..” మెడికవర్ హాస్పిటల్స్, మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాము. మొత్తం 914 మంది సభ్యులకు వివిద రకాల మాస్టర్ హెల్త్ చెకప్ లు చేశారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండో వారంలో ఈ హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని చెప్పాడు. మెడికవర్ వాళ్లు సినిమా జర్నలిస్ట్ లకు కూడా ఉచితంగా హెల్త్ చెకప్ లు చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను”. అని మంచు విష్ణు అన్నాడు.
ఇకపోతే తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు గెలిచిన విషయం తెలిసిందే. సి. కళ్యాణ్ ప్యానల్‌పై దిల్ రాజు విజయం సాధించింది. దీంతో దిల్ రాజు ప్యానల్‌లోని సభ్యలు కీలక పదవులు సొంతం చేసుకున్నారు. అయితే మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో జరిగినన్ని విమర్శలు, వివాదాలు తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో జరగలేదు. అయితే వచ్చే ‘మా’ ఎన్నికల్లో తాను పోటీ చేయనని మంచు విష్ణు చెప్పడంతో తెలుగు సినీ పరిశ్రమలో చర్చ మొదలైంది. ఈ విషయమే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచు విష్ణు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. కారణాలు ఏంటీ? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో.