టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాందించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నారు. మహేష్ బాబు, రీల్ లోనే కాకుండా రీయల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు. ఆయన కూతురు సితార ఘట్టమనేని కూడా ఫుల్ ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంటుంది. అయితే మహేష్ బాబు, సితార ఒకే స్టేజిపై కనిపించడం చాలా అరుదు. అయితే మహేష్ బాబు, సితార లో ఓ షోలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే పలు సార్లు బుల్లితెర పై ప్రసారమయ్యే పలు షోలలో మహేష్ బాబు పాల్గొన్నారు. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గ్ గా వ్యవహరించిన.. ‘మీలో ఎవరు కోటేశ్వరుడు’ షోలో పాల్గొన్నారు. ఇటీవల బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమంలో పాల్గొన్ని మహేష్ బాబు సందండి చేశారు. తాజాగా ఒక షోలో మహేష్ బాబు గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి మాత్రం సింగిల్ గా కాకుండా తనతో పాటు తన కుమార్తె సితారను కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. సితారకు డ్యాన్స్ అంటే ఇష్టం అన్నసంగతి అందరికి తెలిసిందే. గతంలో సితార కూచిపూడి డ్యాన్స్ చేసి.. అందరిని ఆకట్టుకుంది.
ఒకానొక్క సందర్భాంలో మహేష్ బాబు సైతం సితారకు డ్యాన్స్ అంటే ఇష్టమని వెల్లడించాడు. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరు కలిసి ఓ ఛానల్ ప్రసారం కాబోతున్న డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే షోకి ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తకు బలం చేకూరేలా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్త తెలిసిన మహేష్ అభిమానులు ఎంతో ఖుషీ అవుతున్నారు. వీరికి సంబంధించిన షో ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూస్తున్నారు. మరి.. మహేష్ బాబు, సితార ఓ డ్యాన్స్ షోకి రానున్నట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Babu In Zee Telugu New Dance Show 🔥 🔥#SSMB28 @urstrulyMahesh pic.twitter.com/TBqvmnEBma
— I’M Mahesh Babu Fan™ (@IaM_MaheshBabu) August 28, 2022
