సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన సర్కారువారి పాట సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొచ్చేది తెలిసిపోయింది. అందరూ ఊహించినట్టుగా సంక్రాంతి బరిలో కాకుండా ఏప్రిల్ 1న సినిమా రిలీజ్ కానుంది. సమ్మర్ ధమాకాగా సర్కారువారి పాట విడుదల కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1న సినిమా విడుదల చేస్తున్నట్లు మహేష్‌బాబు తన అఫిషియల్ ట్వీట్టర్ ఖాతాలో తెలిపారు. అంతకుముందు సంక్రాంతికి సినిమా రిలీజ్ ఉంటుందని చిత్రం బృందం ప్రకటించింది.
మళ్లీ విడుదల తేదీలో మార్పు చేసింది. చాలా రోజులకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్‌స్టార్ మహేష్ బాబు పోటీ పడతారని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూశారు. కానీ ఇప్పుడు సర్కారు వారి పాట రిలీజ్ డేట్‌లో మార్పు చేయడంతో సంక్రాంతిలో బిగ్ ఫైట్ మిస్ అయింది. చూడాలి మరి సమ్మర్‌లో మహేష్ మానియా నడుస్తుందో లేదో.
April 1st 2022!! 😊#HappyDiwali @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus #SarkaruVaariPaata pic.twitter.com/fw83zwDC7T
— Mahesh Babu (@urstrulyMahesh) November 3, 2021