యువ సామ్రాట్ నాగ చైతన్య, బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం “లవ్ స్టోరీ”. సెప్టెంబర్24న విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ అయింది. ప్రేక్షకుల నుండే కాకా అటు అభిమానులనుండి ఇటు ఇండస్ట్రీ నుండి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ లవ్‌స్టోరీ ప్రత్యేకంగా ఫ్యామిలీతో వీక్షించి ఈ చిత్రం నటీ నటుల పెర్ఫార్మెన్స్ గురించి టెక్నీషియన్స్ వర్క్ గురించి అప్రిషియేట్ చేశారు. “దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. చైయ్ నటుడిగా మరింత ఎదిగిపోయాడని, అద్భుతమైన నటన కనబరిచాడని అన్నారు. సాయిపల్లవి నిజంగా ఓ సంచలనం అనే చెప్పాలి, తెరపై ఆమెలా డ్యాన్స్ చేసే వారిని చూడలేదని ఒక కలలా ఆమె కదులుతుందని అన్నారు.
ఇక పవన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ సంచలనమని, రెహమాన్ సార్ శిష్యుడు పవన్ అని విన్నానని ఖచ్చితంగా రెహమాన్ సర్ గర్వపడతారని అన్నారు. నిర్మాతలు నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు నాకు బాగా సన్నిహితులు. వారు నిర్మించిన లవ్ స్టొరీ సక్సెస్ అయినందుకు వారికి నా అభినందనలు అని తెలియచేశారు.