ఆగస్టు 9 ఈ తేదికి ఉన్న ప్రత్యేకతని మర్చిపోని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఈ రోజు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు.. కోట్లాది మంది మహేష్ అభిమానులకి మాత్రం పండగ రోజు..
ఆగస్టు 9 ఈ తేదికి ఉన్న ప్రత్యేకతని మర్చిపోని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఈ రోజు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు.. కోట్లాది మంది మహేష్ అభిమానులకి మాత్రం పండగ రోజు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహేష్ అభిమానులు ఉదయం నుంచే చాలా ప్రాంతాల్లో మహేష్ బాబు పుట్టిన రోజుని చాలా ఘనంగా జరుపుకున్నారు.. చాలా ఏరియాల్లో కేక్ కటింగ్ లు, అన్నదానాలు పెద్ద ఎత్తున జరిగాయి.. అలాగే మహేష్ అభిమానులు మహేష్ పేరు మీద గుళ్ళల్లో,చర్చిల్లో,మసీదుల్లో ప్రార్ధనలు జరిపించి లాంగ్ లివ్ మహేష్ బాబు అంటూ మహేష్ బాబు మీద తమకున్న ప్రేమని చాటుకున్నారు.
అసలు ఎందుకు మహేష్ బాబు అంటే అభిమానులు అంత అభిమానాన్ని చూపిస్తారు? సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు సైతం మహేష్ అంటే ఎందుకు పూనకం వచ్చిన వాడిలా ఉగిపోతాడు?.. మహేష్ బాబు తెర మీద మాత్రమే హీరో కాదు తెర వెనుక కూడా హీరోనే ..మహేష్ బాబు కేవలం సినిమా ల్లో మాత్రమే నటిస్తాడు ..బయట మాత్రం చాలా సింపుల్గా సాదా సీదా వ్యక్తిలా ఉంటాడు. షూటింగ్ లో ముఖానికి ఉన్నమాకప్ ని తీసేసిన మరుక్షణం సినిమా ఫంక్షన్స్ కి కూడా దూరంగా వుంటూ సగటు మనిషిలా తన ఫ్యామిలీతోనే కంప్లీట్ గా ఉంటాడు. మహేష్ బాబుకున్న ఈ అలవాటే సినిమాలతో సంబంధం లేకుండా మహేష్ బాబు కి చాలా మందిని అభిమానులు గా మార్చింది అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎవరి మీద నైనా గాసిప్స్ వస్తాయి గాని మహేష్ బాబు మీద మాత్రం రావు.
49 వ సంవత్సరం లో కి అడుగుపెడుతున్న మహేష్ బాబు ఇంకా 29 సంవత్సరాల యువకుడిగా కనపడుతున్నారంటే తన మనసు ని ఎప్పుడు నిర్మలంగా ఉంచుకుంటూ సాటి మనిషి పట్ల ప్రేమ దయని చూపిస్తుండటమే కారణం.. హీరో గా ప్రజల్ని తన నటనతో రంజింపచేస్తూనే ఇంకో పక్క తనకి స్టార్ డంని ఇచ్చిన ప్రజల కోసం సామాజిక సేవని కూడా చేస్తున్నారు.. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఎన్నో సార్లు పేద ప్రజల్ని ఆదుకోవడం జరిగింది.. మహేష్ చేసిన చాలా మంచి పనులు బయటికి రావు .ఎందుకంటే ఆయన వాటి గురించి బయటికి చెప్పుకోరు.
కానీ కొన్నాళ్ల క్రితం ఒక ఛానెల్ ద్వారా మహేష్ బాబు చేసిన ఒక మంచి బయటికి రావటం జరిగింది.. కొంత మంది చిన్నపిల్లలు గుండెకి సంబంధించిన సమస్యతో బాధ పడుతుంటే మహేష్ బాబు వాళ్ళకి గుండే ఆపరేషన్ చేయించి ఆ పిల్లలకి కొత్త జన్మని ప్రసాదించారు..ఇలాంటి ఎన్నో మంచి పనులు మహేష్ చేసారు.. కొంచం చేసి ఎక్కువగా చేసినట్టు అదే పనిగా డబ్బాలు కొట్టుకొనే ఈ రోజుల్లో మహేష్ బాబు మాత్రం తాను చేసే మంచి పనులు గురించి ఎక్కడ చెప్పుకోకుండా ఇంకా ఈ సమాజానికి చెయ్యాలసింది చాలా వుంది అనేలా ముఖం మీద చెరగని చిరునవ్వుతో ముందుకు వెళ్తూ ఉంటారు.. మరోసారి మహేష్ బాబు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తు లాంగ్ లివ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.